ఇటీవల కాంగ్రెస్ నేత డికే శివ కుమార్ ని చంద్రబాబు కల్సి మంతనాలు జరిపాడన్న వార్త టీడీపీ ఎంత దాచాలని ప్రయత్నించినా గుప్పుమంది. కాంగ్రెస్ నుంచి చంద్రబాబు విడిపోయినా, మామ పార్టీలో చేరిన తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకొన్నా, ఎన్ని పార్టీలతో సయ్యాటలాడినా చంద్రబాబు నుంచి కాంగ్రెస్ విడిపోవడం జరగదని నాటి నుంచి రుజువు అవుతూనే ఉంది. ఎన్ టీ ఆర్ ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ తనలో 30% కాంగ్రెస్ రక్తం ఉందని ఒప్పుకున్నాడు బాబు .
తనకు వెన్నుపోటు పొడిచిన నాటి నుండీ ఎన్ టీ ఆర్ ఈ విషయమై ఆరోపిస్తూనే ఉన్నా, ఆయనది అరణ్య రోదనగానే మిగిలింది. తను పదవిలో ఉంటే కాంగ్రెస్ కి మరిక పుట్టగతులు ఉండవనే భయంతో కాంగ్రెస్ చంద్రబాబుకు 25 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చి తన ప్రభుత్వాన్ని పడగొట్టించిందని ఆయన ఆనాడే మొత్తుకున్నాడు. ఎన్ టీ ఆర్ ఆరోపణలు చంద్ర బాబుకి కానీ, ఆయన కుటుంబ సభ్యులకి కానీ చీమ కుట్టినట్టయినా అనిపించలేదు. వాటిమీద అతను ఏ మాత్రం స్పందించలేదు.
కానీ ఎన్ టీ ఆర్ మరణించాక మాత్రం, ఆయన అకస్మాత్తు గా దేవుడయ్యాడు. ఆయన ఫొటో పెట్టకపోతే ఓట్లు పడవని బాబు గ్రహించి, ఎన్ టీ ఆర్ ని దేవుడి గా కొలుస్తూ, ఆయన ఫొటో పెట్టి ఓట్లు అడుక్కున్నాడు అనేది జగమెరిగిన సత్యం . ఇంతలోనే అంత మార్పు. ఓట్ల రాజకీయం బాబుకి వెన్నతో పెట్టిన విద్య. ఇంత రాజకీయం చేస్తూ కూడా అవుననో కాదనో ఎన్ టీ ఆర్ ఆరోపణలకు ఈ నాటికీ జవాబు చెప్పలేదు. కనీసం ఖండించలేదు
ఆ తర్వాత కాలంలో కూడా అనేక సందర్భాల్లో అనేకసార్లు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యాడన్నది స్పష్టమే. వైఎస్ మరణం తర్వాత అవిశ్వాసంతో ప్రమాదంలో పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దిగకుండా భుజం పట్టి కాపాడి కాంగ్రెస్ ఋణం కొంతమేర తీర్చుకొన్నాడు బాబు. ఈ పరస్పర అంతర్గత సహకారంలో భాగంగా తాజాగా ఈ మధ్యనే బాబు రహస్యంగా తమిళనాడు వెళ్ళి కాంగ్రెస్ నేత డికే శివకుమార్ ని కల్సి, రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి కాంగ్రెస్ మద్దతు కోరటం జరిగింది
వీటన్నిటినీ తరచి చూస్తే ఒక్క విషయం స్పష్టమవుతుంది . ఒక్క వై యెస్ హయాంలో తప్ప మిగతా సమయాలన్నిటిలో చంద్రబాబు కాంగ్రెస్ తో అంటకాగుతూ, లోపాయికారీ గా రాజీ ఒప్పందాలు చేసుకుంటూ తన పనులు చక్కబెట్టుకొంటూ ఉన్నాడన్న విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.
బాబు నర నరాల్లో జనసేన, టీడీపీ, కమ్యూనిస్ట్ ల రక్తంతో పాటు ఇంకా పాత కాంగ్రెస్ రక్తం ఎప్పటికప్పుడు కొత్తగా ప్రవహిస్తూనే ఉంది. దాన్ని ఆయన మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూనే ఉన్నాడు. ఈ అంతుపట్టని సరికొత్త మిక్సింగ్ బ్లడ్ గ్రూపు కి పేరు కూడా పెట్టలేక తలలు పట్టుకొంటారేమో ప్రపంచం స్థాయి శాస్త్రవేత్తలు కూడా.