ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మరింత దూకుడు పెంచనున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారంలో అందరికన్నా ముందంజలో ఉన్న సీఎం జగన్ తాజాగా మరిన్ని బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
వివరాల్లోకి వెళితే సీఎం జగన్ ఇప్పటికే నాలుగు సిద్ధం బహిరంగ సభల నిర్వహించిన అనంతరం 22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొనసాగించారు.. బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం కావడంతో ప్రజలంతా బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు.. కాగా 22 రోజుల పాటు సాగిన బస్సు యాత్ర ముగిసిన అనంతరం సీఎం జగన్ పులివెందుల వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో ఒకేరోజు మూడు బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా దూకుడు పెంచనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో బహిరంగ సభ, అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో బహిరంగ సభ, సాయంత్రం 3.00 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరులో జరగబోయే బహిరంగ సభలను ముఖ్యమంత్రి సీఎం జగన్ నిర్వహించనున్నారు. ఈ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మరింత దూకుడు పెంచనున్నారు.