సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని అన్ని వర్గాలు స్వాగతించాయి. వైఎస్సార్సీపీ చేయగలిగిందే చెప్పిందనే అభిప్రాయం వ్యక్తమైంది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ మేనిఫెస్టోపై స్పందించారు. వైఎస్సార్సీపీ విధానాలు సంస్కరణల దిశగా ఉన్నాయి. ప్రజలను కష్టాల నుంచి బయట పడేయడం జగన్‌కే సాధ్యం. విశాఖపట్నంను క్యాపిటల్ సిటీగా ప్రకటించడం సంతోషం. ఉత్తరాంధ్ర ప్రజలతోపాటు అంతా విశాఖ రాజధాని కావాలని కోరుకుంటున్నారు. టీడీపీలాగా సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు.
మంత్రి బొత్స సత్యనారాయణ ఇలా స్పందించారు. మేనిఫెస్టో మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని జగన్ చెప్పారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చాం. పేదవాడి జీవన ప్రమాణాలు పెంపొందించడానికే మా మేనిఫెస్టో ఉంది. చంద్రబాబులా మేము దగా చేయడం. విద్య, వైద్యం, వ్యవసాయంపై ఈ ఐదేళ్లు ఫోకస్ పెట్టాం. వచ్చే ఐదేళ్లు కూడా వాటిపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. చంద్రబాబు 2014లో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశాడు. పొదుపు మహిళలకు కూడా మా ప్రభుత్వం బకాయిలు చెల్లించింది.
ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి తన మేనిఫెస్టో ద్వారా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించే విధంగా ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తామనడం శుభపరిణామం. మేనిఫెస్టోని మాయం చేసే పార్టీలా కాకుండా ప్రతి ఇంటికీ మేనిఫెస్టో క్యాలెండర్‌ను అందించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచడం జరుగుతుందని చెప్పారు. ఆయన చెప్పినది చేస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. జగన్ మాట ఇస్తే అది తప్పక చేస్తాడనే విషయంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది.
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇలా స్పందించారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో జనరంజకంగా ఉంది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో నూటికి 90 శాతం నెరవేర్చాం. గతంలో చంద్రబాబు 650 హామీలిచ్చి గెలిచాక మేనిఫెస్టోని తమ పార్టీ వెబ్సైట్ నుంచి తొలిగించిన ఘనుడు. పక్క రాష్ట్రం తెలంగాణలో రూ.2 వేలు ఇస్తే ఇక్కడ రూ.3 వేలను జగన్ అందించారు. ఏమి చేయకుండా అన్నీ చేసేశామని ప్రశ్నలడుగుతున్న విలేకరులను కూడా దబాయించి వ్యక్తి చంద్రబాబు. ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీకే పట్టం కడతారు.
మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. చంద్రబాబులా మేము ప్రజలను మోసం చేయడం లేదు. జగనన్న ఇచ్చిన మాటపై నిలబడ్డారు. ఈరోజు తిరిగి అదే హామీలు పెంచుతూ అమలు చేస్తానని చెప్పిన గొప్ప నాయకుడు. చంద్రబాబుకు మాటపై నిలబడే అలవాటు లేదని ప్రజలు నమ్ముతున్నారు. జగనన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు నవరత్నాలు పథకాలకు అర్హులను చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన చంద్రబాబుకు గతంలో ఇచ్చిన మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగే దమ్ముందా? రియల్ హీరో జగనన్న.