2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు యుద్ధ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆయా రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలు వాడివేడిగా సాగుతున్నాయి. మరొక 18 రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలు ప్రత్యర్థి పార్టీల మధ్య పోటీని పెంచుతున్నాయి. ప్రజలకు చేరువకావడం కోసం తమ పార్టీ విధి విధానాలను ప్రజలకు తెలియజేయడం కోసం అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఆయా పార్టీల నేతలు ప్రజల ముందుకు వస్తున్నారు.
గత నెలలో సిద్ధం సభలతో నాలుగు దఫాలుగా జనాల మధ్యకు వచ్చిన జగన్… సిద్ధం సభలకు పార్టీ కార్యకర్తలు నేతల నుంచే కాకుండా ప్రజల నుంచి వచ్చిన మద్దతును దృష్టిలో పెట్టుకుని ఎన్నికల వేడిని మరింత పెంచుతూ ‘మేమంతా సిద్ధం’ పేరుతో 25 జిల్లాలు కవర్ అయ్యేలా రాష్ట్రమంతా కలియ తిరుగుతూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాడు. అందులో భాగంగానే అశేష ప్రజాదరణ మధ్య సాగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రని నిన్నటితో ముగించుకున్నాడు. ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో రాష్ట్రం నలుమూలల నుంచి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడం రాష్ట్రమంతా చూసింది. ఒకరకంగా చెప్పాలంటే సిద్ధం సభలకు ముందు సిద్ధం సభల తర్వాత అన్నట్టుగా ఈ సభలను నిర్వహించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ…
ఇదే వేడిని కొనసాగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మరొక అడుగు ముందుకు వేశారు. ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధం అంటూ మరో దండయాత్రకు తెరలేపాడు. రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేస్తూ 14 రోజులు సాగే యాత్రకు సిద్ధమవుతున్నాడు. ఈనెల 27వ తేదీ నుండి 45 నియోజకవర్గాలలో సుడిగాలి పర్యటన చేయటానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. క్షణం తీరిక లేకుండా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలతో ఉంటూ ఎన్నికల ప్రచారంలో వేడిని పుట్టిస్తున్న సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. సిద్ధం, మేమంతా సిద్ధం సభలు తర్వాత ఈ 14 రోజులు పర్యటన ద్వారా 45 నియోజకవర్గాల ప్రజలను కలవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తద్వారా కూటమి పై మరో దండయాత్రకు తెరలేపాడు