2024 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. అమలు చేయగలిగే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామని, గతంలో కొనసాగించిన నవరత్న పథకాలను విశ్వసనీయతతో అమలుచేశామని వాటినే తిరిగి రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తూ కొనసాగిస్తామని వెల్లడించిన సీఎం జగన్ తాను అందించబోయే పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారంటే..
రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు రూ.50 వేలు ఇస్తాం 5 సంవత్సరాల్లో అని చెప్పి రైతన్నలకు రూ.67,500 ఇవ్వగలిగాం దేవుడి దయతో. రూ.13,500 రైతు భరోసాగా ఇస్తూ. ఈసారి ఈ 13,500ను రూ.16,000కు పెంచి ఈ 5 సంవత్సరాల్లో రైతన్నకు మరో రూ.80 వేలు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా అనే పథకం ద్వారా. దీని వల్ల 5 ఏళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా 53 లక్షల మంది రైతన్నలకు దీని వల్ల మంచి జరుగుతుంది. పంట వేసే సమయంలో రూ.8 వేలు ఇస్తాం. కటింగ్ సమయంలో మరో రూ.4 వేలు, సంక్రాంతికి మరో రూ.4 వేలు ఇస్తాం.
రైతన్నలకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది. రైతన్నలకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు ఇప్పుడు ఇస్తున్నట్టుగానే కొనసాగుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు, అటవీ, దేవాదాయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఇస్తున్నాం. మేనిఫెస్టో నెట్ లో అందుబాటులో పెడతాం. ఎవరైనా కూడా నెట్ లో పూర్తిగా సమగ్రంగా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం మేనిఫెస్టోను మాయం చేయం. మన మేనిఫెస్టో ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో, నెట్ లో ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆరాటపడతాను.
స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తున్నట్టుగా కొనసాగుతుంది. ఈ 58 నెలల కాలంలో ఇప్పటిదాకా మత్స్యకారులకు రూ.50 వేలు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో కూడా మరో రూ.50 వేలు ఇస్తూ మొత్తంగా దాన్ని రూ.1 లక్ష దాకా తీసుకుని పోతాం.
వాహన మిత్ర కింద సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకుంటున్న వాళ్లకు ఈ 58 నెలల కాలంలో రూ.50 వేలు ఇచ్చాం. వచ్చే 5 ఏళ్ల కాలంలో కూడా మరో రూ.50 వేలు ఇస్తాం. మొత్తంగా చూస్తే.రూ.1లక్ష వాళ్ల చేతిలో పెట్టినట్లవుతుంది.
మత్స్యకార భరోసా వల్ల దాదాపుగా 2.43 లక్షల మంది మత్స్యకారుల కుటుంబాలకు మంచి జరిగిస్తూ రూ.538 కోట్లు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ వాహన మిత్ర కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలో 2.76 లక్షల మందికి మంచి జరిగిస్తూ రూ.1,300 కోట్లు ఇవ్వడం జరిగింది.
ఇదొక్కటే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ సొంత టిప్పర్, సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింపజేస్తున్నాం.
ఇదొక్కటే కాకుండా ఆటో, టాక్సీ, స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ,సొంత టిప్పర్లు సొంత లారీ నడిపే వారికి కూడా ఈ పథకాన్ని విస్తరింప చేస్తున్నాం. ఆటో కి మాత్రమే కాదు, టాక్సీ కి మాత్రమే కాదు, మ్యాక్సీ క్యాబ్ కి మాత్రమే కాదు, సొంతంగా టిప్పర్లు లారీలు నడిపే డ్రైవర్లకు కూడా వర్తింప చేస్తున్నాం. ఆటో, మ్యాక్సీ క్యాబ్, టాక్సీ, టిప్పర్, లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా కింద పది లక్షల రూపాయల దాకా ఇచ్చేలాగా కార్యక్రమం చేస్తాం. దీనికోసం వారికి రిజిస్టర్ చేసి ఐడి కార్డులు ఇస్తాం.
స్వయం ఉపాధిని ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో టాక్సీ లారీ కొనుగోలు కోసం, బ్యాంకులు నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే, ఆ రుణాల మీద మూడు లక్షలు వరకు, వాటిపై ఆరు శాతం వడ్డీ భారం మాత్రమే ఉండేలా, అంటే అర్ధరూపాయి వడ్డీ భారం మాత్రమే వారికి ఉండేలా, మిగతా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది.
న్యాయవాదులకు లా నేస్తం ఇప్పుడు ఇస్తున్న విధంగానే కంటిన్యూ అవుతుంది. దాదాపుగా 5,781 మందికి రూ.42 కోట్ల రూపాయలతో లా నేస్తం కింద, వాళ్ల సర్వీస్ లోని తొలి మూడు సంవత్సరాల్లో, వాళ్ళని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం ప్రతీనెల రూ. 5,000 చొప్పున ఆరు నెలలకొకమారు రూ. 30,000 ఇస్తూ చేయిపట్టి నడిపించే కార్యక్రమం కొనసాగుతుంది. కొత్తగా వచ్చే అందరికీ ఈ పథకం ఇదే విధంగా కొనసాగుతుంది.
చేనేత కార్మికులకు ఈ ఐదు సంవత్సరాలలో ఏటా రూ.24 వేలు చొప్పునరూ.1,20,000 చొప్పున ఇవ్వగలిగాము. ఈ పథకాన్ని మళ్లీ ఈ ఐదు సంవత్సరాలలో కూడా దీన్ని కొనసాగిస్తూ మరో రూ.1,20,000 చొప్పునఅందించనున్నాము. దీంతో గత ఐదేళ్లలో, రానున్న ఐదేళ్లలో కలిపి ఒక్కో లబ్దిదారునికి ఇచ్చే మొత్తాన్ని రూ.2,40,000 వరకు తీసుకెళ్తాం.
మేనిఫెస్టోలో చెప్పకపోయినా చేనేత కార్మికులకు, ఆప్కోకు గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో సహా రూ.468 కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం. పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశామని సీఎం జగన్ వెల్లడించారు.