2024 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. అమలు చేయగలిగే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పెట్టామని, గతంలో కొనసాగించిన నవరత్న పథకాలను విశ్వసనీయతతో అమలుచేశామని వాటినే తిరిగి రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తూ కొనసాగిస్తామని వెల్లడించిన సీఎం జగన్ తాను అందించబోయే పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారంటే.. రైతన్నలకిచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే 2019లో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు రూ.50 వేలు ఇస్తాం […]
రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మూడో విడత రైతు భరోసా అందించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. పెట్టుబడి సాయంతో పాటు సున్నా వడ్డీ రాయితీ నగదును రైతుల అకౌంట్లలో జమచేయనున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా ప్రతీ ఏడాది రూ.12,500 చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల సాయం రైతులకు అందిస్తామని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మాట ఇచ్చారు. ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీకి మించి […]