2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమవడానికి మరింత సమయం దొరికింది. ఇప్పటికే నాలుగు ప్రాంతాలలో సిద్ధం సభలు నిర్వహించి ఎన్నికల హడావిడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సిద్ధం సభలకి ఊహించిన రీతిలో ప్రజల నుంచి మద్దతు లభించింది.
ఎన్నికల ఏప్రిల్ లో ఉంటాయి అనే ఊహగణంతో ఈ నెల 18 నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్ఛాపురంలో తన ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉండగా, ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికలు మే 13వ తేదీన జరుగునున్న తరుణంలో ప్రచారాన్ని వాయిదా వేస్తూ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ఈ నెల 27 నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించనున్నట్లు మొదటి మూడు రోజుల షెడ్యూల్ ని సజ్జలు రామకృష్ణారెడ్డి మీడియాకి విడుదల చేశారు.
ఈ నెల 27వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభమయ్యే మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొదట పులివెందుల నియోజవర్గంలోనీ ప్రజలతో మమేకమై, కమలాపురం నియోజవర్గం మీదుగా ప్రొద్దుటూరు చేరుకొని సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రొద్దుటూరులో సభ తర్వాత నంద్యాల జిల్లాలోకి అడుగుపెట్టి 28 వ తేది ఉదయం ఆళ్లగడ్డలో ప్రజలతో ఇంటరాక్షన్ తర్వాత సాయంత్రం నంద్యాలలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ రాత్రి నంద్యాలలోనే బస చేసి , 29వ తేదీ గుడ్ ఫ్రైడే కావడంతో ఆరోజు కూడా నంద్యాలలోనే ఉంటారు. మార్చి 30వ తారీకు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించి కోడుమూరు నియోజవర్గంలో ప్రజలతో ఇంటరాక్షన్ లో పాల్గొని సాయంత్రం ఎమ్మిగనూరులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇలా రాష్ట్ర మొత్తం సిద్ధం సభలు జరగని 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తారు. ప్రతి రోజు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటనలు చేస్తూ, ఒక బహిరంగ సభలో పాల్గొంటారు. అలా రాష్ట్ర మొత్తం పర్యటన తర్వాత తిరిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని మీడియాతో సజ్జలు రామకృష్ణారెడ్డి మీడియాతో వెల్లడించారు.