సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో సంక్షేమ పాలనతో ముందుకు సాగుతున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. అయితే రాష్ట్రంలో అభివృద్ధి లేదు అంటూ ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలు గత నాలుగున్నరేళ్లుగా వింటూనే ఉన్నాం. ఇవేమీ పట్టించుకోకుండా జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి వేయాల్సిన అడుగులను ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్తున్నాడు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ ని ముందు వరుసలో నిలబెట్టాడు.
జగన్ పాలనలో చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ ఫోర్ కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ‘‘కల్పతరువు’’ పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది. దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఓ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసింది.
గత ప్రభుత్వ గణాంతాలతో పోలిస్తే ప్రస్తుత వైయస్ జగన్ ప్రభుత్వ పాలనలో స్టార్టప్ ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఈ గణాంకాలను వాస్తవిక లెక్కలలో చూసుకుంటే 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586 కు పెరిగింది. వీటిలో 2019లో 1,552 మంది పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైయస్ జగన్ పాలనలో ఆంధ్రకు వచ్చిన కంపెనీల సంఖ్య గత ప్రభుత్వం కంటే పెరిగింది గానీ, ఎక్కడ తగ్గిన దాఖలాలు కనబడవు. అయినా సరే రాష్ట్ర భవిష్యత్తు మీద ఏమాత్రం ఆలోచన చేయకుండా కేవలం జగన్ ని బద్నాం చేయాలన్న అసూయ ద్వేషాలతో మాత్రమే అభివృద్ధిపై తప్పుడు కథనాలు వండి వారిస్తుంది ఎల్లో మీడియా..