అన్న వస్తున్నాడు.. మంచి రోజులు వస్తున్నాయని చెప్పండి.. ఇది వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ ఆయన అన్నివర్గాలకు ఆనాడు భరోసా కల్పించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తన పాలనలో ఆయన వివిధ పథకాల రూపంలో ప్రజలకు అందించిన మొత్తం రూ.4.15 లక్షల కోట్లు. ఇందులో రూపాయి అవినీతి లేదు. ఈ డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేశారు.
ఒక్కో పథకంలో ఇలా..
ఇంకా ఎన్నో..
ఇవే కాదు. ఇంకా ఎన్నో పథకాలకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయాలు పెట్టి గ్రామస్వరాజ్యం తెచ్చారు. వాటిల్లో యువతకు ఉద్యోగాలు కల్పించారు. వారు, వలంటీర్లు పథకాలను క్షేత్రస్థాయిలో అర్హులకు పక్కాగా అందిస్తున్నారు. అవినీతి రహితంగా జరుగుతున్న ప్రక్రియ ఇది. ఏదైనా కారణాలతో అర్హులు మిగిలిపోతే వారి కోసం మళ్లీ ప్రత్యేక కార్యక్రమం పెడుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి నగదు అందిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలోనూ ఆపలేదు. దేశంలో ఏ ప్రభుత్వం ఇంత పారదర్శకంగా పథకాలను అమలు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి పథకాలు అందాయి. కులం చూడం.. మతం చూడం.. రాజకీయాలు చేయం.. ప్రతి పథకాన్ని అవసరమైన వారికి చేరుస్తామని ఆనాడు జగన్ చెప్పినట్లే ప్రస్తుతం జరుగుతోంది. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా గ్రామాలకు వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ వర్గీయులు చాలామంది మాకు పథకాలు అందాయని ఆనందంగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో కుటుంబం రూ.లక్షల్లో లబ్ధి పొందింది. జగన్‌లా పథకాలు అమలు చేయడం ఎవరికీ సాధ్యం కాదని ప్రజానీకం కొనియాడుతోంది.
– వీకే..