మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న వేలాది మందికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. వారికి ధైర్యం చెప్పి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎంత ఖర్చయినా సరే చికిత్స చేయించి అండగా ఉండాలని తన సిబ్బందికి ఆదేశిస్తున్నారు.
సంతమాగులూరు మండలంలో బస్సు యాత్ర వద్దకు అనేక మంది వచ్చి జగన్‌కు సమస్యలు చెప్పుకొన్నారు. వారిలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న 16 ఏళ్ల వయసున్న షేక్ హుస్సేన్ బాషా కూడా ఉన్నాడు. ఇతను కొమ్మలపాడు గ్రామ వాసి. తండ్రి పేరు షేక్ ఖాదర్ అలీ, తల్లి షేక్ మౌలాబీ. భార్యాభర్తలు కూలి పనికి వెళ్తేనే కుటుంబం గడిచేది. సంవత్సరం క్రితం వారి జీవితాన్ని ఓ ఘటన కుదిపేసింది. హుస్సేన్‌కు ముఖం ఎడమ చెంపపై వాపు వచ్చింది. మొదట్లో దీనిని చిన్నపాటి సమస్య, ఏమీ కాదని తల్లితండ్రులు భావించారు. అయితే బాలుడు తీవ్ర ఇబ్బంది పడుతుండగా డాక్టర్ల వద్ద చూపించారు. మల్టిపుల్ హై అటెన్యూయేషన్ గడ్డలతో ఆసిఫైయింగ్ ఫైబ్రోమాతో బాధపడుతున్నట్లు గుర్తించారు. గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామంలోని ఓ ఆస్పత్రిలో హుస్సేన్‌కు రెండు సర్జరీలు చేని కణితి తొలగించారు. ఇందుకు సుమారు రూ.10 లక్షల ఖర్చయింది. పనిచేయగా వచ్చే డబ్బుతో జీవినం సాగించే ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తల్తెత్తాయి.
అంతటితో అయిపోలేదు. విధి మరోసారి వారిని చిన్నచూపు చూసింది. హుస్సేన్ వ్యాధి పూర్తిగా తగ్గిపోలేదు. ఆరు నెలల వ్యవధిలోనే వాపు మరింతగా పెరిగిపోయి ఎడమ చెంప, తలవెనుక భాగానికి విస్తరించింది. ఇదంతా నడుస్తున్న సమయంలోనే కొద్దినెలల క్రితమే ఖాదర్ అలీకి అనారోగ్య సమస్యలు వచ్చాయి. వైద్యుల దగ్గరకు తీసుకెళ్లగా లివర్ ఆపరేషన్ చేశారు. ఓ పక్క కొడుకు కదల్లేని స్థితిలో ఉన్నాడు. మరోవైపు భర్త అనారోగ్య స్థితిలో ఉండడంతో మౌలాబీ వారిని చూసుకుంటూ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పెద్ద కొడుకు సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది.
ఈ నేపథ్యంలో జగనన్న మాత్రమే తమకు సాయం చేస్తాడని నమ్మిన ఆ కుటుంబం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆయన్ను కలిసింది. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి బాషాకు వైద్య సహాయం చేయాల్సిందిగా ఆరోగ్యశ్రీ అధికారులకు ఆదేశించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.