ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పార్టీలో గెలిచి సీటు ఇవ్వలేదని మరో పార్టీలోకి మారిన ఆరణి శ్రీనివాసులు, వర ప్రసాద్, ఆదిమూలం తమ పదవుల కోసం ఊసరవెల్లి కంటే దారుణంగా రంగులు మారుస్తున్నారు అంటూ ఉమ్మడి జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. కనీసం ప్రజాభిమానం లేని వీరిని వైసీపీ అధినేత చేరదీసి తన పార్టీ తరపున పోటీ చేపించి గెలిపించుకున్నాడని కానీ తల్లి లాంటి పార్టీని వదిలి తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారారు అని ప్రజలు మండిపడుతున్నారు.
ఆరణి శ్రీనివాసులు ప్రజారాజ్యం నుండి ఓడిపోయి టీడీపీలో పోటీ చేసే అవకాశం రాకపోతే జగన్ పిలిచి టికెట్ ఇచ్చి తన బలంతో గెలిపిస్తే జిల్లా కేంద్రం అయిన చిత్తూరును అభివృద్ధి చెయ్యకుండా ప్రతి పనిలో లంచం తీసుకుంటూ, కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెట్టడంతో పాటు తన అధికారాన్ని ఉపయోగించి భూములు కబ్జా చేశారు. దీనితో జగన్ శ్రీనివాసుల్ని పక్కన పెట్టేసరికి పదవి లేకుండా ఉండలేక జనసేన పార్టీలో చేరి తిరుపతి నుండి పోటి చేస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన తిరుపతిలో గొడవలు చేస్తూ అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు.
వరప్రసాద్ తమిళనాడులో పెద్ద హోదాలో పనిచేశారని, ప్రజలకు మంచి చేస్తారని, 2014లో తిరుపతి ఎంపీగా అవకాశం ఇచ్చి వైసీపీ అధినేత జగన్ గెలిపించుకున్నారు . ఎంపీగా గెలిచిన తరువాత వరప్రసాద్ తన సొంత పార్టీ నాయకులనే నోటి దురుసుతో తిట్టడంతో పాటు పైరవీలకు తెరలేపి, పెద్ద ఎత్తున వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. 2019లో గూడూరులో ఎమ్మేల్యే గా మరొకసారి అవకాశం ఇచ్చి గెలిపించుకుంటే అక్కడకూడా పార్టీని ఇబ్బందులు పెట్టారు. సహాయం కోసం ఎవరు వచ్చినా నాకేంటి అంటూ మామూళ్ళకు తెరలేపారు. ఇక జగన్ తనకు టికెట్ ఇవ్వరని తెలిసి చంద్రబాబు సూచనతోబీజేపీలో చేరి తిరుపతి ఎంపీగా పోటి చేస్తున్నారు.
సత్యవేడు నియోజకవర్గంలో ఆదిమూలం 2014లో ఓడిపోయినా, నమ్మకం ఉంచి 2019లో గెలిపించుకుంటే నియోజకవర్గ పరిధిలో ఆదిమూలం ఇసుక దందాకు తెరలేపారు. దీనితో నియోజకవర్గన్ని మార్చేసరికి తట్టుకోలేక తిరిగి టీడీపీ లో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే గా పోటి చేస్తున్నారు.
ఇప్పటికే ఆదిమూలంను తమ గ్రామాల్లో అడుగుపెట్టవద్దు అంటూ ఎదురుతిరిగిన ప్రజలు సత్యవేడులో అడుగు పెట్టనీయ్యడం లేదు. వరప్రసాద్ ను కూడా సొంత సామాజిక నేతలే చిదరించుకుంటూ ఓటు అడగడానికి రావద్దని ఖరాఖండిగా చెబుతున్నారు. ఆరణి శ్రీనివాసులు తన రౌడీ రాజకీయంతో తిరుపతిలో అలజడి సృష్టిస్తుండే సరికి సామాన్య ప్రజలు భయంతో దూరం జరుగుతున్నారు. ఈ ముగ్గురు ఊసరవెల్లులను తరిమి కొడతాం అంటూ ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఎక్కడిక్కడ వారి ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు.