2014 ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ప్రతి జిల్లాకి ఇచ్చినట్లే చిత్తూరు జిల్లాకు కూడా చేయనలవి కానీ హామీలిచ్చి నట్టేట ముంచాడు. ఒకసారి చంద్ర బాబు ఇచ్చిన హామీలు పరిశీలిస్తే..
– తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం
– కుప్పం ఎయిర్పోర్టు
– ఏర్పేడు ఎన్ఐఎంజెడ్
– ఐఐటీ
– ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్
– అపోలో హెల్త్ సెంటర్
– హార్టికల్చర్ జోన్
– మెగాసిటీ
– మెగా ఫుడ్ పార్కు
– మెట్రో రైల్
– ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ -శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం
– ఐటీహబ్గా తిరుపతి
తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తానని చెప్పిన చంద్రబాబు దానికి సంబంధించి భూ కేటాయింపులకు కానీ, రన్ వేలకు సంబంధించి కానీ ఎలాంటి అడుగులు ముందుకు వేయలేదు. సొంత నియోజకవర్గమైన కుప్పంపై చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిదో ఈ ఉదాహరణ చూస్తే తెలిసిపోతుంది. దాదాపు 30 సంవత్సరాలు ఎమ్మెల్యే గా, 14 ఏళ్లు సీఎంగా ఉన్నా కూడా తన సొంత నియోజకవర్గమైన కుప్పంని మునిసిపాలిటిగా కానీ, రెవెన్యూ డివిజన్ గా కానీ చంద్రబాబు చేయలేదు. ఎలాంటి హామీలు ఇవ్వకుండానే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కుప్పాన్ని మున్సిపాలిటీ & రెవెన్యూ డివిజన్ గా చేయడం గమనార్హం.
ఏర్పేడులో ఎన్ఐఎంజెడ్ ( నేషనల్ ఇన్వెస్ట్మెంట్ & మాన్యుఫాక్చరింగ్ జోన్) ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తర్వాత ఆ విషయం గురించి ఎక్కడా ప్రస్తావన చేయకపోవడం విశేషం. 2015 లో తాత్కాలికంగా మొదలైన తిరుపతి ఐఐటీ 2023 సంవత్సరంలో కానీ పూర్తి రూపు దిద్దుకోలేదు. ఇండియన్ ఇన్సటిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తానని ప్రచారం చేసిన బాబు ఆ దిశగా అడుగులు వేయలేదు. అపోలో హెల్త్ సెంటర్ ఊసే లేదు, హార్టికల్చర్ జోన్ , మెగా సిటీ, మెగా ఫుడ్ పార్క్ ఇలా నోటికి వచ్చిన హామీలతో ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాడు చంద్రబాబు.
తిరుపతికి మెట్రో రైల్ అంటూ హామీ ఇచ్చిన బాబు మూడోసారి సీఎం అయిన తర్వాత కూడా తిరుపతి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తిరుపతిలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా చంద్రబాబు ప్రయత్నించలేదు. జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ను నిర్మించి పూర్తి స్థాయిలో లో ట్రాఫిక్ సమస్యను తీర్చింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, ప్రభుత్వం సహకారంతో 17 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించి కనీవినీ రీతిలో సీఎం జగన్ తిరుపతి రుపు రేఖలు మార్చారు. శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకంలని లింక్ చేస్తూ ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ నిర్మిస్తానని చెప్పుకొచ్చిన బాబు ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన చంద్రబాబు తిరుపతికి మాత్రం ఐటీ హబ్ ను తీసుకురాకుపోవడం శోచనీయం. చంద్రబాబు మాటలన్నీ డొల్ల అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏమీ లేదు.