‘అనాకపల్లి ఎంపీగా సీఎం రమేష్‌ను, దాని పరిధిలోని కూటమి అభ్యర్థులను గెలిపించిండి. మనమంతా అభివృద్ధిని చూస్తాం’ అంటూ ఇటీవల సినీ నటుడు చిరంజీవి వీడియో విడుదల చేశారు. ఇందులో రమేష్ ఆయన పక్కనే ఉన్నారు. దీంతో చిరు కూటమికి సపోర్టు చేస్తున్నాడంటూ మెగా అభిమానులు, ముఖ్యంగా జనసైనికులు డ్యాన్స్ చేస్తున్నారు. అసలు వీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మెగా బిగ్ బ్రదర్ అంటే తెలుగు తమ్ముళ్లకు చెప్పలేనంత కోపం ఉంది. అడపాదడపా మీటింగ్‌లలో దానిని బయట పెడుతూనే ఉంటారు.
తన అన్నను ఏమైనా అంటే సహించనని ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల సభలో అన్నాడు. చిరును అందరి కంటే ఎక్కువగా దూషించింది టీడీపీ నాయకులే. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో నర్సీపట్నం అని ఒక నియోజకవర్గం ఉంది. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తుంది చింతకాయల అయ్యన్న పాత్రుడు. గతంలో ఓసారి ఈయన తనయుడు విజయ్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వింటే కూటమిపై మెగా అభిమానులే ఉమ్మేయడం ఖాయం.
‘2009లో ఒక దౌర్భాగ్యుడు పార్టీ పెట్టాడు. ఎవరి అభిమానంతో వాడు అంత స్థాయికి వెళ్లాడో వారికి తెలుస్తుంది. సామాజిక న్యాయం అన్నారు. ఆయన మీద మోసుతోనే తెలీదు. డ్యాన్స్‌తోనే తెలీదు. 80 లక్షల మంది ఓట్లు వేశారు. వీరి దగ్గరకు వాడు ఎప్పుడైనా వచ్చి నేను పార్టీని తాకట్టు పెడుతున్నానని చెప్పాడా? మీ అందరూ ఆలోచించాలి. 80 లక్షల మంది తెలుగువాళ్ల గౌరవాన్ని మూటగట్టి తీసుకెళ్లి సోనియా గాంధీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన దౌర్భాగ్యుడు చిరంజీవి’ విజయ్ మనసులో నుంచి వచ్చిన ఈ మాటలు పవన్, మెగా అభిమానులకు గుర్తున్నాయో లేదో. ఇప్పుడు అధికారం కోసం అందరూ ఒకే గూటికి చేరారు.
విజయ్ చిరంజీవిని వాడు.. వీడు అన్నాడు. అంతలా అగౌరవపరిచిన వ్యక్తికి మెగా అభిమానులు, జనసైనికులు ఎలా సపోర్టు చేస్తున్నారో వారికే తెలియాలి. అభిమానగణాన్ని చూపించి సొమ్ము చేసుకోవడం మెగా సోదరులకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే చిరంజీవి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరాడు. దీనిని బట్టి ఆయనకు ఆత్మాభిమానం ఏ మాత్రం లేదని, డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతాడని అర్థమవుతోంది. ఇక పవన్ తన అన్నను ఏమైనా అంటే సహించనన్నాడు. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు నానా మాటలు అంటూనే ఉన్నారు. అంటే వీరు ఏమన్నా సేనానికి ఓకేనా..
– వీకే..