2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలన్నీ ఒక ఎత్తు… పిఠాపురం చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరొక ఎత్తు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి టిడిపి బిజెపి జనసేన కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పవన్ కళ్యాణ్ గెలవాలి అని తపన పడుతున్నాడు. కనీసం ఈ ఒక్కసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తే చాలు జన్మ ధన్యం అనేంతలా ఆరాటపడుతున్నాడు.
అయితే ఇక్కడే అసలు చిక్కు అంతా మొదలైంది. తన అన్న చిరంజీవిని వెంటాడిన శాపమే పవన్ కళ్యాణ్ కు తగలనుందా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఒక పక్క పెయిడ్ ప్రమోషన్స్ తో జనం అంతా పవన్ వైపే ఉన్నారని భ్రమ కలిగించడానికి తమ అనుకూల సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ, కార్యకర్తలు శతవిధాలా పాటు పడుతున్నప్పటికీ గతంలో చిరంజీవికి ఎదురైన అనుభవమే పవన్ కళ్యాణ్ కు ఎదురు అవుతుందా అనే సంశయంలో పవన్ కళ్యాణ్ అభిమానులోకం మునిగిపోయింది. పోటీ అన్న తర్వాత గెలుపోటములు సర్వసాధారణం అయినప్పటికీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అది రకమైన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇంతకీ ఏంటి ఆ శాపం? ఎందుకింత భయం కలిగిస్తుంది? ఎందుకంత ఆందోళనకు కారణం అవుతుంది? అని ఆలోచిస్తే గతంలో చిరంజీవి పార్టీలో పోటీ చేసినప్పుడు మహిళ చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే ఇప్పుడు జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి ప్రత్యర్థిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఒక మహిళ పోటీ చేయడం యాదృచ్ఛికమో, కాల మహిమో తెలియదు కానీ.. వంగా గీత చేతిలో పవన్ కళ్యాణ్ ఓటమి తప్పదా అంటే అవును అని అంటున్నాయి స్థానిక వర్గాలు.. స్థానికంగా వంగా గీత బలమైన నాయకురాలు కావడం, ఉన్నత విద్యావంతురాలు అవ్వటం, ఆమె చేసినటువంటి మంచి పనులు కళ్ళముందే కనబడటం, అన్నిటిని మించి గెలుపైన ఓటమైన ఇక్కడే మా కళ్ళముందే ఉంటుంది మేం పిలిస్తే పలుకుతుందనే నమ్మకం జనాల్లో బలంగా ఉండటం మూలాన ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. సినీ హీరో గా పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉన్నా సరే స్థానికంగా ప్రజల మన్ననలు పొందటంలో నమ్మకాన్ని చూరగొనడంలో పవన్ కళ్యాణ్ చరిష్మా పనికి రావడం లేదు.. ఈ నేపథ్యంలోనే అన్నకు తగిలిన శాపమే తమ్ముడికి కూడా తగలునుందా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.