చంద్రబాబు పొత్తుల కోసం ఎక్కడికైనా వెంపర్లాడుతారు. అందుకే బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీకి వెళ్లొచ్చారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయనేమన్నారంటే..
పొత్తులకు పోయి చంద్రబాబు నాలుగు ఓట్లు దండుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబుతో బీజేపీ పొత్తుకు ప్రయత్నిస్తోందని ఎల్లో మీడియా విచిత్రంగా రాస్తోంది. బీజేపీకి టీడీపీతో అంత అవసరం లేదు. మేము చేసిన మంచిని తెలియజేసి ఒంటరిగా పోటీచేస్తున్నాం. ప్రజలు అప్పుడు చంద్రబాబు పాలన చూశారు. ఇప్పుడు జగన్ పాలన చూశారు. ప్రజలకు ఎవర్ని గెలిపించుకోవాలో వారికే ఓట్లు వేసి తీర్పు ఇస్తారు. రాజ్యసభలో పోటీ చేయడానికి టీడీపీకి అర్హత లేదు. వాస్తవానికి వారికి సరైన సంఖ్యా బలం లేనందున వాళ్లు పోటీ చేయడం అనైతికం. కానీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఎల్లో మీడియాలో లేనిపోనివి రాసి కొన్ని రోజులు ఆనందం పొందుతారు అంతేనని సజ్జల వ్యాఖ్యానించారు.
చంద్రబాబు స్క్రిప్ట్‌ను షర్మిల చదువుతోంది. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాలో వాటిని షర్మిలతో మాట్లాడిస్తున్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు. తెలంగాణ వ్యవహారాలు మేము పట్టించుకోము. సీఓటర్ సంస్థ 2019లో కూడా టీడీపీకి అనుకూలంగా ఫలితాలను ఇచ్చింది. దాని విస్వసనీయత ఏంటో ఫలితాల తరువాత అందరికీ తెలిసిన విషయమే. వారి క్రెడిబిలిటీ ఏంటో వారికే తెలియాలి. మిగిలిన సర్వేలన్నీ మాకు అనుకూలంగా రిజల్ట్స్ ఇస్తున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.