సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర వియజయవంతం అయ్యాక సీఎం జగన్ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులకన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ జంక్షన్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే…
అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు , మోసాలు ఒక్కసారి 2014లో ఈ పాంప్లెట్ చూద్దామా ? 2104లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు స్వయంగా సంతకం పెట్టి, ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వారి ఫోటోలు పెట్టి.. ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికీ పంపించాడు. ఆ తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచి.. 2014 నుంచి 2109 వరకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో.. ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన పాంప్లెట్ లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశాడా ? నేను చదువుతాను. మీరే చెప్పండి. ఇందులో ఒక్కటైనా అమలు చేశాడా ?.
ఇందులో ముఖ్యమైనది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రైతుల రుణమాఫీ జరిగిందా? రెండోది పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు.డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలను,వారి కుటుంబ సభ్యులను నేనుఅడుగుతున్నాను.. రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా రద్దు అయ్యాయా ?
మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి స్కీం కింద రూ.25వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. నేను అడుగుతున్నాను. ఇన్ని వేల మంది ఇక్కడున్నారు. ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి డిపాజిట్ చేశాడా అని అడుగుతున్నాను. ఇంటింటికీ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, అంటే రూ.1.20 లక్షలు ఇచ్చాడా ? అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఇస్తామన్నారు. మూడు సెంట్లు స్థలం కథ దేవుడెరుగు, చంద్రబాబు హయాంలో ఇక్కడున్న ఇన్ని వేలమందిలో ఏ ఒక్కరికైనా కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.
రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలుమాపీ అన్నాడు. జరిగిందా?. ఉమెన్ ప్రొటెక్షన్ పూర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నారు, చేశారా?.ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు, జరిగిందా ? రాజానగరంలో కనిపిస్తోందా ? ఆలోచన చేయండి. ఇదే ముగ్గురు.. చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలప్పుడు మీ ఇంటికి 2014లో పంపించి.. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత.. ఇందులో ఆయన చెప్పినవి ఒక్కటంటే ఒక్కటి జరిగిందా? అని అడుగుతున్నాను. ఇప్పుడు మళ్లీ ఇదే ముగ్గురు, మళ్లీ కూటమిగా ఏర్పడ్డారు. మళ్లీ మేనిఫెస్టో డ్రామా అంటున్నారు. నమ్ముతారా? సూపర్ సిక్స్ అంటున్నారు నమ్ముతారా? తమ్ముడూ నమ్ముతారా? చెల్లెమ్మా నమ్ముతారా ?
సూపర్ సెవెన్ అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం అంటున్నారు నమ్ముతారా? ఇంటింటికీ బెంజికార్ అంట నమ్ముతారా? ఇలాంటి వాళ్ల అబద్దాలు, మోసాలు ఏ స్ధాయిలో ఉన్నాయో గమనించమని మిమ్నల్ని కోరుతున్నానని సీఎం జగన్ చంద్రబాబు చేసిన మోసాలను బట్టబయలు చేశారు.