దివంగత నందమూరి తారకరామారావు గారి జయంతి, వర్ధంతులు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నుంచి ఇటువంటి స్టేట్మెంట్లు రావడం మామూలే. మామగారి ఆశయ సాధనకి ఆయన స్ఫూర్తి ఉంటే చాలు అని మామూలు అల్లుళ్ళు అనుకుంటారు. కానీ విపరీతమైన విజనరీ ఉన్న వారే, స్ఫూర్తితో పాటు ఆయన పదవి కూడా కావాలని కోరుకుని పావులు కదిపి మరీ సాధించుకుంటారు.
చంద్రబాబు యన్టీఆర్ ని దారుణంగా వెన్నుపోటు పొడిచి, చెప్పులేయించి, గద్దె దింపి తానెక్కాక ఇలా చిలుక పలుకులు వదిలితే పాపం అప్పట్లో జనం అందరూ నమ్మేవారు. “యన్టీఆర్ మృతితో దేశం ఒక మహా నాయకుని, రాష్ట్రం ఒక ఆదర్శ మూర్తిని, స్ఫూర్తి ప్రదాతని కోల్పోయిందని” అవకాశం వచ్చినపుడల్లా చంద్రబాబు కల్లబొల్లి కబుర్లతో మొసలి కన్నీరు కారుస్తూనే ఉన్నారు.
కాలం మారింది, సోషల్ మీడియా వచ్చాక జనానికి ప్రతి విషయంలోనూ బొమ్మా బొరుసూ వైపు ఉండే నిజాలు తెలుసుకోగలిగే అవకాశం వచ్చింది. అయినప్పటికీ, ఇప్పుడు కూడా చంద్రబాబు వంటి వారు ఇంకా తాము ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అంటూ బిల్డప్‌లు ఇచ్చుకుంటూ, ఇప్పటికీ యన్టీఆర్ పేరు వాడకుండా మేనిఫెస్టోలు విడుదల చేయలేని స్థితిలో ఉన్నారు. రాబందులు కూడా శవం మీద ఎముకలు కనపడగానే వదిలేసి వెళ్ళిపోతాయి. కానీ, ముప్పయ్యేళ్ళవుతున్నా ఇంకా యన్టీఆర్ చావుని ఉపయోగించుకుని రాజకీయం చేసే రాబందులు మాత్రం యధేచ్ఛగా ఎగురుతూ, ఇదంతా పేద ప్రజలు కొన్ని కలలను సాకారం చేయడమే యన్టీఆర్ కోరుకున్న రామరాజ్యం అంటూ ఊదరగొడుతూ తిరుగుతున్నారు.