జనసేనతో పొత్తులో ఉన్న చంద్రబాబు సీట్ల విషయంలో చంద్రబాబుకి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని తిట్టిన కారణంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు, గోరంట్ల బచ్చయ్యచౌదరికి, మెగా కుటుంబాన్ని తిట్టిన చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు ఐటీడీపీ అధ్యక్షుడు చింతకాయల విజయ్ కి టికెట్ ఇవ్వకూడదని పవన్ కళ్యాణ్ కండిషన్ పెట్టడంతో టీడీపీలో సీనియర్ లకు టికెట్ ఇవ్వలేని స్థాయికి చంద్రబాబు వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ ఎలా చెప్తా అలా వినే పరిస్థితికి రావాల్సి వచ్చింది. 40 ఏండ్లు పార్టీనీ గెలిపించుకోలేని స్థాయికి చంద్రబాబు వెళ్ళడం చేతనే ఇలా అన్నిటికీ తలొగ్గాల్సి వస్తోంది. తన పార్టీ ఎక్కడ పోటీ చేయాలో కూడా పవన్ కళ్యాణ్ తో కలిసి చర్చించిన తర్వాతే చెప్పాల్సి ఉంది. ఇంత అయోమయం లో పడడానికి పవన్ కళ్యాణ్ తో పొత్తే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది..