వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అయిన చంద్రబాబు తన రాజకీయాలకు నందమూరి కుటుంబాన్ని వాడుకుంటూనే ఉన్నాడు. ఆనాడు వారు రామారావుపైనే తిరుగుబాటు చేసేలా చేశాడు. ఇప్పటికీ వారంతా బాబు కబంధహస్తాల్లోనే ఉన్నారు. తాజాగా గురువారం రామారావు వర్ధంతి నాడు నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. అది కూడా బాబు పుణ్యాన జరిగిందే.
జూనియర్ ఎన్టీఆర్.. ఈయన రామారావు అసలైన వారసుడని అభిమానులు భావిస్తుంటారు. అయితే ఈ జూనియర్‌కు ఎన్నోసార్లు బాబు తన వెన్నుపోటు రుచి చూపించారు. 2009లో ఎన్నికల సమయంలో ప్రచారం చేయించుకున్నాడు. అప్పట్లో తెలుగుదేశం శ్రేణుల నుంచి వచ్చిన స్పందన చూసి బాబు ఆందోళనకు గురయ్యాడు. ఏనాటికైనా టీడీపీ జూనియర్ చేతుల్లోకి వెళ్లిపోతుందని, లోకేశ్‌ను ఎవరూ పట్టించుకోరని కుట్ర రాజకీయాలకుS తెరతీశాడు. ఇందుకోసం నందమూరి కుటంబాన్నే వాడుకున్నాడు. అందుకే వాళ్లు జూనియర్‌ను ఏనాడు తమ సొంత వాడిగా చూడరు. దూరం పెట్టి అవమానిస్తుంటారు. టీడీపీ సోషల్ మీడియా కూడా జూనియర్ సినిమాలపై విషం చిమ్ముతుంటుంది. బాలకృష్ణ అభిమానులు అతడిని తిడుతూ పోస్టులు పెడుతుంటారు. తన కొడుకు విషయంలో జరిగిన పరిణామాలను చూసి హరికృష్ణ బతికున్నప్పుడు ఎంతో బాధపడేవారని ఆయన అభిమానులు చెబుతుంటారు.
ఏమైందంటే..
ఎన్టీఆర్ వర్ధంతి సంద్భంగా హైదరాబాద్‌లోని ఆయన ఘాట్ వద్దకు జూనియర్, ఆయన అన్న కల్యాణ్‌రామ్ నివాళులర్పించేందుకు గురువారం తెల్లవారుజామునే వెళ్లారు. ఆ సమయంలో వారి అభిమానులు ఆ ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉదయం అక్కడికి చేరుకున్న బాలకృష్ణ జూనియర్ ఫ్లెక్సీలను చూసి రగిలిపోయారు. తన బావ బాబు, అల్లుడు లోకేశ్‌కు ఇష్టం లేని వ్యక్తిపై తనకు ఇష్టం ఉండదన్నట్లు ప్రవర్తించారు. సొంత అన్న కొడుకని చూడకుండా వాడి ఫ్లెక్సీలు తీసిపారేయండి అంటూ తన మనుషులపై కేకలు వేశారు. వాళ్లు వెంటనే వాటిని తొలగించారు. బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలు తీసేయండి అంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇప్పటికే జూనియర్ విషయంలో టీడీపీ, నందమూరి కుటుంబం వ్యవహరిస్తున్న తీరును చూసి ఆయన అభిమానులు కోపంగా ఉన్నారు. గతంలో టీడీపీ సభలో జూనియర్ అభిమానులు తమ హీరో ఫ్లెక్సీలు ప్రదర్శించగా బాబు, ఆయన పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. జూనియర్‌ను దూరం చేసుకోవద్దని కొందరు సీనియర్ నాయకులు అనేక సందర్భాల్లో అన్నారు. అయినా బాబు తన కొడుకు కోసం పట్టించుకోవడంలేదు. పైగా రామారావు శత జయంతి ఉత్సవాలకు దూరం పెట్టాడు. నేడు ఆయన బావమరిది బావ కళ్లలో ఆనందం కోసం అన్న కొడుకు ఫ్లెక్సీలు తీసిపోరేయండని అహంకారంతో చెప్పడం చర్చకు దారి తీసింది. నందమూరి కుటుంబం జూనియర్‌కు ఏ స్థాయిలో వ్యతిరేకంగా ఉందో చెప్పేందుకు ఈ సంఘటన నిదర్శనమని భావిస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆయనకు ఇష్టమైన మనవడికి వెన్నుపోటు పొడిచి కొడుకును సంతోషపెట్టాడు.
– వీకే..