వీరప్పన్ ఏనుగులని ప్రేమిస్తాడని , దావూద్ ఇబ్రహిం అత్యంత శాంతి కాముకుడని చెబితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చంద్రబాబు రైతులపై ప్రేమను చూపిస్తే కూడా అంతే హాస్యాస్పదంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభించడంలో , రైతుల పై దూషణలకి దిగడంలో చంద్రబాబును తలదన్నే రాజకీయ నాయకుడు మరొకరు ఉండరు. ఎన్నికలు సమీపిస్తే చాలు రైతుల ఓట్ల కోసం పాకులాడే చంద్రబాబు ఎన్నికల అనంతరం రైతులను ఏ విదంగా తన రాజకీయ విధానాలతో కష్టాల పాలు చేస్తాడో ప్రజలందరికి తేలిసిన విషయమే
అలాంటి చంద్రబాబు శ్రీకాకుళం, ఆముదాలవలసలో ప్రజాగళం సభలలో ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతే రాజుగా పాలన సాగిస్తామని, రైతు సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని తన ఊకదంపుడు ఉపన్యాసం లో చెప్పుకొచ్చారు. 14ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీసం రైతులకి చేసిన మేలు ఒక్కటైనా ఉందా అని చూస్తే ఏ ఒక్కటీ కనపడదు. పైగా రైతులపై పోలీసులతో కాల్పులు జరిపిన చరిత్ర ఆయన సొంతం. రైతు రుణమాఫీ హామీ ఇచ్చి వారిని నట్టేట ముంచిన ఘతన ఆయన సొంతం. ఇటువంటి చరిత్ర ఉన్న చంద్రబాబు నేడు రైతులకి మేలు చేయడానికి చూస్తా అంటూ హామీలు ఇస్తే నమ్మే రైతన్నలు ఎవరు?
చంద్రబాబు పాలనలో పంటలు నష్టపోయి ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోయిన రైతన్నలు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటే , ఆ ఆత్మహత్యల్లో ప్రేమ విఫలం కావడం వలన చనిపోయిన వారు కూడా ఉన్నారని నీచమగా మాట్లాడిన చంద్రబాబు అహంకారాన్ని రైతన్నలు మర్చిపోగలరా, వద్దన్నా వ్యవసాయం చేస్తున్నారు, ఒకసారి పంట ఎండిపోతే బుద్ది వస్తుంది, వ్యవసాయం టైం వేస్ట్ (దండగ), పంటలు ఎండిపోతే ఇక కరెంటు ఎందుకు, పేదలకు భూములు పంచితే పేదరికం పోతుందా? ఉచిత కరెంటు ఇస్తే వాటిపై బట్టలు ఆరేసుకోవాల్సిందే, కరువుకు తుఫానే మందు అన్న చంద్రబాబు మాటలు ఎవరు మర్చిపోగలరు ?
ఇక తానే స్వయంగా రాసుకున్న మనసులో మాట పుస్తకంలో ప్రాజెక్టులు కడితే లాభంలేదు, ఎకరాకు అయ్యే ఖర్చు ఎక్కువ, పన్నుల రూపంలో వచ్చేది తక్కువ అంటూ నిస్సిగ్గుగా మాట్లాడిన చంద్రబాబు నేడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతే రాజుగా పాలన సాగిస్తామని, రైతు సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం వారిని మరోసారి మోసం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం కాదా అంటు సూటిగా ప్రశ్నిస్తున్నారు రైతుసంఘ నాయకులు. వీరి ప్రశ్నలకి తెలుగుదేశం వారి దగ్గర నుండి సమాధానం వస్తుందో లేదో వేచి చూడాలి.