తెలుగుదేశాన్ని తన కుమారుడు లోకేశ్‌కే ఇస్తానని, నందమూరి వంశానికి ఇచ్చే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేసినట్లు తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్‌పై తనకున్న అయిష్టతను ఆయన బయటపెట్టారని టాక్ నడుస్తోంది.
ఇటీవల ఓ జిల్లాలో ప్రచారానికి బాబు వెళ్లగా కొందరు సీనియర్ నేతలు బస్సులో కలిసి మాట్లాడారు. ఎన్టీఆర్‌ను ప్రచారానికి పిలిపించాలని, అప్పుడే కొంత ఉపయోగం ఉంటుందని, లేకపోతే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారట. అంటే మేము పనికిరామా?, పార్టీని కాపాడలేమా?, ఓట్లు వేయించలేమా? అనే ధోరణితో బాబు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దీంతో చిన్నబోయిన నాయకులు ప్రస్తుతం అతను ప్యాన్ ఇండియా స్టార్ అని, యువ కార్యకర్తల కోరికను మీ ముందు ఉంచామని సర్దిచెప్పగా బాబు ‘నేను జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి రానివ్వను. అతను ఎంత పెద్ద స్టార్ అయినా కావొచ్చు. నా ముందు ఎవరి ఆటలు సాగవు. లోకేశే నాకు ముఖ్యం. నా తర్వాత మీరంతా అతని సారథ్యంలోనే పనిచేయాలి. ఇదే ఫైనల్’ అన్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
వాస్తవానికి హరికృష్ణ కుటుంబమంటే చంద్రబాబుకు మొదటి నుంచి చిన్నచూపు ఉంది. హరికృష్ణ రాజకీయంగా ఎదగలేకపోవడానికి ప్రధాన కారణం బాబే. 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేత ప్రచారం చేయించారు. కుటుంబంలో ఉన్న విభేదాల నేపథ్యంలో ఆ సమయంలో బాలకృష్ణ ఆ పిల్లాడ్ని తీసుకురావొద్దని గట్టిగా చెప్పారట. అందుకు బాబు ఎన్నికల వరకేనని, ఆ తర్వాత పట్టించుకోనని హామీ ఇచ్చారని తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ అంటే బాలకృష్ణకు అస్సలు నచ్చడనేది జగమెరిగిన సత్యం. ఆ మధ్య ఫ్లెక్సీలు కూడా తీసేయించాడు. తన అల్లుడు లోకేశ్ ప్రయోజనాలే అతనికి ముఖ్యం. సొంత అన్న కుమారుడిని ఏనాడూ ప్రేమగా చూసింది లేదు. పరాయి కుటుంబానికి చెందిన వాడిగా భావిస్తూ ఉంటారు.
టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాలని, అప్పుడే పార్టీ బతుకుతుందని అతని అభిమానులు, కార్యకర్తలు అనేక సభల్లో ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయొద్దని వాళ్లని హెచ్చరించిన సందర్భాలున్నాయి. లోకేశ్‌కు ప్రజాబలం లేదు. ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయలేడు. ఫెల్యూర్ పొలిటిషియన్‌గా మిగిలిపోయాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బాగా మాట్లాడుతాడు. యువతలో క్రేజ్ ఉంది. లోకేశ్‌తో పోల్చుకుంటే వెయ్యి రెట్లు బెటర్. కానీ బాబుకు తన వారసత్వమే ముఖ్యం. కుమారుడి చేతిలో పార్టీని పెట్టాలని చూస్తున్నాడు. దీనిని వ్యతిరేకించిన నాయకులందరినీ తండ్రీకొడుకులు ఇబ్బందులు పెట్టారు.
ఎన్నికల నేపథ్యంలో జూనియర్‌ను పిలిపించాలనే డిమాండ్ తెలుగుదేశంలో ఎక్కువైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తూ చంద్రబాబు తనను దూరం పెట్టారని లోకేశ్ బాధపడుతున్నాడు. మంగళగిరిలో సక్రమంగా ప్రచారం చేయడం లేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు వినపడితే లోకేశ్ తనకు దూరమైపోతాడని బాబు సన్నిహితుల వద్ద వాపోయాడని ప్రచారం ఉంది. ఈ పరిణామాలన్నీ తారక్ ఫ్యాన్స్‌ను అసంతృప్తిలోకి నెట్టాయి. అయినా ఏమీ చేయలేరు. టీడీపీ ఎప్పటికీ వారిది కాదు.