సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబుచేసిన వ్యాఖ్యలివి.. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో నా జోలికి ఎవరూ రాలేదు, ఈ బచ్చా వచ్చాడు, నేనేంటో చూపిస్తా వదిలిపెట్టను.. అంటూ సీఎం జగన్ పై తన కోపాన్నంతా ప్రజాగళం సభలో చంద్రబాబు వెళ్లగక్కాడు.
ఆయననేంటో ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ కి 1995 లోనే చూపించాడు, ఇప్పుడు కొత్తగా చూపించడానికి ఏమీ మిగల్లేదు. వెన్నుపోటు పొడవడం తప్ప సీదా సీదా రాజకీయం చేయడం బాబుకి ఎప్పుడు అలవాటే లేదు. జగన్ ను వెన్నుపోటు పొడిచే అవకాశమూ లేదు. ఇకపోతే బచ్చా అంటున్న ఇదే జగన్ ను ఎదుర్కోవడానికి 2014 లో మోదీ పవన్ ల సాయం కావాల్సి వచ్చింది, అదీ చాలక అమెరికా బడ్జెట్ కు కూడా అందని 600 హామీలు ఇవ్వాల్సి వచ్చింది. ఇక పోతే అదే జగన్ మీద తన అంగబలం, అర్ధబలం అంతా ఉపయోగించి శాయశక్తులా పోరాడినా 2019 లో ఓడిపోవాల్సి వచ్చింది. ఓటమి అంటే అలాంటి ఇలాంటి ఓటమి కాదు కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యాడు అదే బచ్చా దెబ్బకి.
తను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి, ఇంకా పాతికేళ్ల కుర్రాడినే అని చెప్పుకునే బాబు, ఇప్పుడు బాబు అంటున్న అదే బచ్చా దెబ్బకి రాజమండ్రి జైల్ లో కూర్చుని మలద్వారం లో సమస్య ఉంది, ఒంటి నిండా చీముకారుతుంది నాకు బెయిల్ ఇవ్వండి అని అర్జీ పెట్టుకోవాల్సి వచ్చింది. నేనే అవినీతి చేసినా నాకే చట్టాలు వర్తించవు అని చట్టాల్లోని లొసుగులు వాడుకుని తప్పించుకు తిరిగే 40 ఏళ్ల కుట్ర రాజకీయం నన్ను అరెస్ట్ చేయొద్దు మొర్రో అంటూ రోజుకో కేసులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకోవాల్సి వచ్చింది.
ఇక పోతే ఇదే బచ్చా దెబ్బకు తట్టుకోలేక ప్రధాన మంత్రులను తయారు చేసా, భారత రత్నాలు ఇప్పించా, చక్రాలు తిప్పా అని చెప్పుకునే బాబు ఢిల్లీ వీధుల్లో అమిత్షా అపాయింట్మెంట్ కోసం వేచి చూడాల్సి వచ్చింది.. ఛీ పో అన్నా కూడా కాళ్లు విడవకుండా ఇదే బచ్చాను ఎదుర్కోవడానికి అమ్మనా బూతులు తిట్టిన అదే బీజేపీ తో మళ్లీ కలవాల్సి వచ్చింది.. సింగల్ గా పోటీ చేసి నా క్రెడిబిలిటీ మీద ఎన్నికలకు వెళతా అంటున్న జగన్ బచ్చా ఎలా అవుతాడు బాబు? అతని మీద ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక గుర్తింపు లేని పార్టీల నుండి జాతీయ పార్టీల వరకు అందరితో కలిసి వెళుతున్న తమరు బచ్చా అవుతారు కానీ…