ఇదేమి చంద్రబాబు హైటెక్ సిటీ నేనే కట్టా, ఏఐ ని నేనే తెచ్చా లాంటిది కాదు. అవి ఎప్పుడు ఉండేవే. ఇప్పుడు కొత్తగా చెప్పుకోబోయేది బాబు రచించే కుట్ర అమలు భాద్యత, దాని సానుకూల ఫలితం గురించి..
ప్రత్యర్థుల మీద చంద్రబాబు ఏదైనా వ్యూహం రచిస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒకరి మెడకు బలంగా చుట్టుకుని ఒకవేళ వ్యూహం విఫలం అయితే ఆ వ్యూహం అమలు చేసిన వారి మెడకు ఉరితాడు బిగుసుకుంటుంది. ఒకవేళ సఫలం అయితే దాని తాలూకు ఫలితమంతా బాబుది, బాబు కులానిది… ఉదాహరణకు ఎలిమినేటి మాధవరెడ్డి హత్య. నక్స్లైట్ లను తీవ్రంగా అణచివేస్తున్న, హింసను తగ్గిస్తున్న అనే పేరుతో నయీం అనే ఓ మాజీ నక్సలైట్, రౌడీషీటర్ అయిన వ్యక్తిని చేరదీసి నక్సలైట్ లను ఊచకోత కోసేవాడు బాబు. బెల్లిలలిత శరీరం ముక్కలు చేయడం, గద్దర్ ఒంట్లో తూటాలు తాలూకు గుర్తులు వగైరాలు అప్పటివే. అన్నలను అణిచివేసిన పేరు బాబుకు దక్కింది. కానీ నక్సలైట్ ల దాడిలో మరణించింది మాత్రం అప్పటి హోమ్ మంత్రి “ఎలిమినేటి మాధవ రెడ్డి”.
అంతేనా, ప్రజారాజ్యం పార్టీ లోకి కోవర్ట్ గా పంపడానికి ఎంతో మంది ఉండగా బీసీ సామాజిక వర్గ నేత అయిన దేవేందర్ గౌడ్ ని ఎన్నుకున్నాడు. టీడీపీ నుండి ఓ వ్యూహం ప్రకారం తానే బయటకు పంపి, ఓ పార్టీ పెట్టించి దాన్ని ప్రజారాజ్యం లో విలీనం చేయించాడు. ప్రజారాజ్యం అంతు అయితే చూడగలిగాడు గానీ పార్టీ లో సీనియర్ నేత అయిన దేవేందర్ గౌడ్ రాజకీయ భవిష్యత్తు అక్కడితో ముగిసింది.
ఇక తెలంగాణ లో బిచానా సర్దేయకుండా అధికార మదం తో తెరాసా ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తో ఎంఎల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ను కొనడానికి రేవంత్ రెడ్డి ని ఎంచుకున్నాడు. పాపం రేవంత్ రెడ్డి ఆడియో వీడియో లతో దొరికిపోయాడు. కూతురు వివాహానికి కూడా కోర్టు పర్మిషన్ తీసుకుని రావాల్సి వచ్చిందీ రేవంత్ కు. కానీ బాబు సేఫ్ గానే ఉన్నాడు.
యతావాత చెప్పొచ్చేది ఏంది అంటే, కొత్తగా బాబుకు ఖాతాలో మరో బలిపశువు బలయ్యేలా ఉంది. రాష్ట్రంలో అంతమంది కరుడుగట్టిన తన సామాజిక వర్గపు టీడీపీ నేతలు ఉండగా పని గట్టుకుని కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమాను సీఎం జగన్ పై దాడి చేయడానికి వాడుకున్నాడు. ఇప్పుడు జగన్ కు ఏం కాకపోవడంతో ఆ దాడికి ఫలితం లేకపోయింది. విఫలమైన ఈ పథకానికి ఇప్పుడు బోండా ఉమా భాద్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే భయం తో రకరకాల స్టేట్మెంట్ లు ఇచ్చి భుజాలు తడుముకున్న బోండా ఉమా, ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. నిందితుల నుండి బలమైన సమాచారం ఉండటంతో బోండా ఉమా తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతోనే అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటే జూన్ 4 తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బెదిరింపులకు కూడా దిగాడు.. దీన్నిబట్టి దాడి వెనుక బోండా ఉమా ఖచ్చితంగా ఉన్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బోండా పరారీతో ఈ చర్చ మరింత ఊపందుకుంది.
బాబు ఏ దుష్ట కార్యానికి తలపెట్టినా తాను ఎన్నుకొనే పావులు ఖచ్చితంగా తమకులపు వ్యక్తులు అయ్యుండరు, కానీ సానుకూలఫలితం వస్తే మాత్రం అనుభవించేది ఆయన సామాజిక వర్గం వారేనని మేధావులు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం…