జగన్‌ది అధికార దుర్వినియోగం, రాక్షస పాలన అంటూ విరుచుకుపడే గురువింద గింజకే గురువయినటువంటి చంద్రబాబు… గతంలో తాను ఎన్నిసార్లు, ఎన్నిరకాలుగా ఏయే విషయాల్లో అధికార దుర్వినియోగం చేసారో పాపం ఆయనకి గుర్తు రాకపోవడం కడు విచారకరం.
అధికారం దుర్వినియోగం ఏ మోతాదులో జరిగిందో స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ వంటి వాటిలో ప్రస్తుతానికి నిరూపితం చేయడానికి సీఐడీ లాంటి సంస్థలు అవసరమేమో కానీ… యన్టీఆర్ నుంచి అధికారం లాగేసుకున్నాక, యన్టీఆర్ వర్గపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో కూడా అడుగు పెట్టిన ఇవ్వకుండా చేసేందుకు బాబు ఉపయోగించిన తెలివితేటలు అన్నీ ఇన్ని కావు. అప్పటి రాజకీయ విశ్లేషకులు సైతం నోరెళ్ళబెట్టేలా బాబు తన మార్కు రాజకీయాలను స్పీకరు సహాయంతో చేసారు.
“యన్టీఆర్ విగ్రహం చూసి వెళితే ఏ పని అయినా అయిపోతుందని” ఇప్పుడు అత్యంత సాత్వికంగా మాట్లాడుతున్న బాబు… యన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి పదవి దక్కించుకున్నాక… తనని కాదని యన్టీఆర్ వైపే ఉన్న ఎమ్మెల్యేలను ముప్పుతిప్పలు పెట్టించాడు. శాంతియుతంగా నిరసన చేపడదాం.. అనుకున్న వారిని అత్యంత ప్రమాదకరం గా చిత్రీకరిస్తూ, చేతిలో ఉన్న పేపరు ఓనరుతో నచ్చిన వార్తలు వేయించి, వాటినే సాక్ష్యాలుగా పేపరు కటింగులని చెప్పి జాతి చేసి, వారందరినీ మూకుమ్మడిగా అసెంబ్లీ నుంచి గెంటేయించేంత వరకూ… బాబు రాజకీయం ఆగలేదు. అలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఏకంగా 150 మంది యన్టీఆర్ వర్గపు మనుషులకు… బాబు నరకం చూపించి వదిలిపెట్టాడు.
సాక్షాత్తూ యన్టీఆర్ కే సభా హక్కుల ఉల్లంఘన అంటూ స్పీకరుచే నోటీసులు ఇప్పించి అసెంబ్లీ నుంచి బయటకు గెంటి వేయించాడు. అసెంబ్లీ నియమ నిబంధనావళిని అడ్డు పెట్టుకుని “వెన్నుపోటుదారుడు చంద్రబాబు” అని స్లోగన్ లు ఉన్న నల్ల చొక్కాలు వేసుకొచ్చిన యన్టీఆర్ వర్గపు ఎమ్మెల్యేలను, ఒకేసారి 18 మందిని సస్పెండ్ చేయించి అసెంబ్లీ ని తన చెప్పుచేతల్లో నడిపించుకున్నాడు. ఇదేంటీ ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులను సైతం తన ఏకపక్ష ధోరణితో అణచివేసాడు.
చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ గా వ్యవహరిస్తున్న స్పీకర్ తీరు నచ్చక ఘెరావ్ చేద్దామనుకున్న యన్టీఆర్ వర్గపు ఎమ్మెల్యేలందరినీ… ఒకే సాకు చూపించి బయటకు గెంటేయించి యన్టీఆర్ ని సభలో ఒంటరి చేసి క్రూరంగా నవ్విన బాబు… ఇప్పుడు యన్టీఆర్ ని దేవుడు అంటూ కొనియాడుతూ… ఓట్లు తెచ్చి పెట్టే
మెషీన్ గా చూడటాన్ని యన్టీఆర్ ఆత్మ ఎన్ని జన్మలెత్తినా కూడా క్షమించదు. కానీ అదేంటో… యన్టీఆర్ కి నిజమైన వారసులం అని చెప్పుకునేవారు, అసలైన అభిమానులం అని అనుకునేవారు మాత్రం ఇంకా బాబు మాయాజాలంలోనే పడి కొట్టుకుంటున్నారు.