నిన్నటి సిధ్ధం సభలో జగన్ టీడీపీ, జనసేనలను ఉద్దేశించి చేసిన వాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పడూ పాయింట్ టు పాయింట్ మాత్రమే మాట్లాడి తన ప్రసంగాలని చేసే జగన్ నిన్న మొదటిసారి రూటు మార్చి చంద్రబాబునీ, టీడీపీ వైఖరిని, మేనిఫెస్టోని వాయించి వదలగొట్టారు. ఎంతలా అంటే… చంద్రబాబు స్వయంగా చర్చకు సిద్ధమా అని జగన్ ని ప్రశ్నంచేంత.
సరే, మరి నిజంగా జగన్ జరిగిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధమంటూ వస్తే… చంద్రబాబుకి నిలబడే శక్తి, యుక్తి ఉందా? తాను గతంలో చేసిన ఏ పధకం గురించయినా అనర్గళంగా మాట్లాడి జగన్ని చర్చలో ఓడించగలరా??? టీడీపీ చేసే పెత్తందారీ, హిపోక్రసీ రాజకీయాలను జగన్ అంత మంది ఉన్నా సభలో నగ్నంగా నిలబెట్టినందుకే చంద్రబాబు ఇలా భుజాలు తడుముకుంటున్నారా ??? అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో చర్చలో తేలుస్తానన్న చంద్రబాబు మరి తాను చేసిన అభివృద్ధిని చూపగలడా అనేవి లక్ష డాలర్ల ప్రశ్నలు.
అభివృద్ధి పరంగా పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, అయిదు మెడికల్ కాలేజీలు, మరో పన్నెండు నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, తీరు మారిన సర్కారు బడులు, తల్లిదండ్రుల ఖాతాలో చదువు కోసం పడుతున్న అమ్మ ఒడి డబ్బులు, ఇంగ్లీషు మాట్లాడుతున్న పిల్లలు, వైజాగుకి కొత్తగా వచ్చిన సాఫ్టువేరు కంపెనీలు, పెరిగిన ఉద్యోగాలు, వాటి ద్వారా నమోదయిన పీయఫ్ అకౌంట్లు ఇలా ఇన్ని అంశాలు జగన్ వైపు ఉన్నాయి.
చంద్రబాబు ముక్కీమూలిగీ అయిదేళ్ళలో కట్టిన ఆ రాజధాని తాత్కాలిక భవనాలు, పుట్టినప్పటినుండీ విశాఖలో తెచ్చాను అని చెప్పుకునే ఒకట్రెండు సాఫ్టువేరు కంపెనీలు తప్ప అతని పాలనలో ఎం వచ్చాయని ?? అసలు పోర్టులూ హార్బర్లు, మెడికల్ కాలేజీల వంటి వాటి గురించి అయితే చంద్రబాబు మాట్లాడుకోవడమే మంచిది. ఇంక చెప్పుకోవలసినవి ఏమైనా ఉన్నాయి అంటే అవి కేవలం ఆయన హయాంలో ఈనాడులో వేయించిన అమరావతి గ్రాఫిక్ డిజైన్లే. అవి తప్ప చంద్రబాబు చూపించడానికి అతని హయాంలో ఏం జరగలేదు. చివరికి నీళ్ళు నములుతూ పలాయనవాదం చిత్తగించాలే తప్ప… కనీసం ఆయనకి అలవాటు అయిన జూమ్ మీటింగులో కూడా చర్చలో పూర్తిగా పాల్గొనలేడు.