నరసరావుపేటలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ అక్రమ ఓట్లు, అధికారుల నిర్లక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నూతన ఓటర్ల జాబితాలో నరసరావుపేటలో ‘చంద్రబాబు నారా’ పేరుతో రెండు ఓట్లు నమోదవ్వడంతో ఆశ్చర్యపోవడం ప్రజలవంతయింది.
పట్టణంలోని 145వ పోలింగ్ కేంద్రం జాబితాలో క్రమసంఖ్య 134లో చంద్రబాబు నారా పేరుతో ఓటు ఉంది. అందులో పేర్కొన్న ఇంటినంబరులో ఆ పేరున్న వ్యక్తులే లేరు. అదే ఇంటినంబరుతో ఆర్ &బి కార్యాలయంలోని 155వ పోలింగ్ కేంద్రంలో రెండో ఓటు కూడా నమోదైంది. రెండింటిలోనూ ఒకరి ఫొటోనే ఉండటం కూడా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.