2024 సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబు కు కత్తి మీద సాములాగా తయారయ్యాయి. ముఖ్యంగా బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత కూటమి నేపథ్యంలో సీట్లు ఎంపిక చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. దీంతో ఏం చేయాలో తెలియక ఎవరిని ఎక్కడ నుండి పోటీ చేయించాలో అర్థం కాక అభ్యర్థుల విషయంలో
తల నేలకేసి కొట్టుకుంటున్నాడు చంద్రబాబు. మరొకపక్క కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, బిజెపి, జనసేనల మధ్య సఖ్యత లేక బిజెపితో ఇమడలేక నియోజకవర్గాల్లో కూటమి పార్టీల కార్యకర్తలు నేతలు సమన్వయం కోల్పోయి, కుర్చీలు ఎగరేసి మరీ కొట్టుకుంటున్న సంఘటనలు కోకోల్లలు.
ఇదిలా ఉండగా మరొక పక్క పుండు మీద కారంలా రఘురామ కృష్ణంరాజు టార్చర్ చంద్రబాబుకు ఉండనే ఉంది. ఆ క్రమంలోనే ఉండి, మాడుగుల అభ్యర్థులను మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఉండిలో మంతెన రామరాజును కాదని రఘురామ రాజుకు సీటు ఇచ్చే యోచనలో బాబు ఉన్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇక మాడుగలలో పైలా ప్రసాద్‌కు బదులు బండారు సత్యనారాయణ మూర్తికి టిక్కెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మాడుగుల వైసీపీ అభ్యర్ధి, మంత్రి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా వెళ్లడంతో ఆయన కూతురు అనురాధను మాడుగుల అభ్యర్ధిగా ప్రకటించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
అయితే అనురాధను ఎదుర్కోవడానికి టిడిపి అభ్యర్థి పైలా ప్రసాద్‌కు సత్తా చాలదని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయించిన గెలవడం అసాధ్యమని అంచనాకు వచ్చిన బాబు బండారుకు టికెట్ ఇవ్వడంపై సర్వే చేయిస్తున్నాడని సమాచారం. అలాగే సత్యవేడులో కూడా కోనేటి ఆదిమూలాన్ని మార్చే అవకాశం ఉన్నట్లు, అభ్యర్థి మార్పు కోసం ఇప్పటికే చంద్రబాబు సంకేతాలు పంపినట్లు టిడిపి వర్గాల నుండి వినిపిస్తున్న మాట. అయితే ఇప్పటికే ఎప్పుడు ఏ జెండా మోయాల్సి వస్తుందో అనే మీమాంస లో బ్రతుకుతున్న టీడీపీ జనసేన కార్యకర్తలకు సీట్ల మార్పులతోఅభ్యర్ధి ఎవరో.. ఏ జెండా పట్టుకోవాలో తెలియక మరింత అయోమయ పరిస్థితి ఏర్పడింది.