విశాఖ తీరంలో డ్రగ్స్ పట్టుబడటం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. ఈ డ్రగ్స్ వెనుక అధికార వైసీపీ ఉందని టీడీపీ ఆరోపిస్తుండగా ఆ డ్రగ్స్ సంధ్యా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద విశాఖకు చేరుకోవడం గమనార్హం. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ కంపెనీకి నందమూరి, నారా, దగ్గుపాటి కుటుంబాలకు సన్నిహిత సంబంధాలు బయటపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైసీపీపై పసలేని విమర్శలు చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే లక్ష్యంగా డ్రగ్స్ ని ఇక్కడికి తరలించారనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇటీవల చంద్రబాబు చిలకలూరిపేటలో జరిగిన ప్రజాగళం సభలో మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు వైసీపీకి అనుకూలంగా లేరని స్వేచ్ఛగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ డ్రగ్స్ పట్టుబడిన సమయంలో కొందరు అధికారులు తమ విధికి ఆటంకం కలిగించారని ఛార్జ్ షీట్ లో సిబిఐ అధికారులు పొందుపరిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అండర్ లో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు ఎందుకు సీబీఐ అధికారులకు విధినిర్వహణలో అడ్డుపడేందుకు ప్రయత్నించారో తెలియాల్సిఉంది.
ఈ విషయం పక్కనబెడితే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడాన్ని ప్రారంభించిన నేతగా చంద్రబాబు నాయుడికి పేరుంది. అంతా నేనే అన్నీ నేనే అని చెప్పుకునే చంద్రబాబు అడ్డదారుల్లో గెలిచేందుకు అప్పటివరకూ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం లేని డబ్బు,మద్యం, కానుకలను ఓటర్లకు పంచి ఎన్నికల్లో గెలవొచ్చు అని నిరూపించారు. కానీ ప్రలోభాలు అన్నిసార్లు పనిచేయకపోవడంతో 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందారు. దీంతో 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. కానీ ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారిపోవడంతో డ్రగ్స్ & గంజాయి ద్వారా ఎన్నికలకు అవసరమైన నగదును సమకూర్చుకునే పనిలో పడ్డారని తెలుస్తుంది. ఇప్పటికే నారాయణ విద్య సంస్థలను వేదికగా చేసుకుని పలువురు మార్వాడీల వద్దనుండి పెద్ద మొత్తంలో నగదును సేకరించారని సమాచారం ఉంది.
విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ గురించి పూర్తి వివరాలు తెలియకుండా వార్తలు రాయడం సరికాదని విశాఖ సీపీ రవిశంకర్ వ్యాఖ్యానించారు. రు. విశాఖ పోర్టు తమ పరిధిలో ఉండదని తాము కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నామని, విధి నిర్వహణలో తమని ఎవరూ ఒత్తిడి చేయలేరని స్పష్టం చేశారు. కాగా దాదాపు 25వేల కేజీల డ్రగ్స్ పట్టుబడటం చిన్న విషయం కాదు. వాటి విలువను గణించడం కూడా సాధ్యం కాని పరిస్థితి. ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్ ను రాష్ట్రానికి తీసుకురావడంలో ఎవరి హస్తం ఉంది? అంత అవసరం ఎవరికి ఉందనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా వేళ్లన్ని నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల వైపే చూపిస్తూ ఉండటం చంద్రబాబు మాత్రం వైసీపీపై ఆరోపణలు చేయడం గమనిస్తే తప్పించుకోవడానికే ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబే ఈ డ్రగ్స్ ని రాష్ట్రానికి తీసుకువస్తే మాత్రం రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ చంద్రబాబును క్షమించరనేది అంగీకరించాల్సిన సత్యం..