ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని డబ్బు మయం చేసిన ఘనత చంద్రబాబుదేనని రాజకీయాల పట్ల అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరూ అంటూ ఉంటారు. 1995లో పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ గారి సీఎం పదవిని లాక్కునేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా శాసన సభ్యులను రెచ్చగొట్టడమే కాకుండా వారిని వైస్రాయి హోటల్ లో దాచి, వారిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసిన చంద్రబాబు, ఒక్కో శాసన సభ్యుడుకి ఏడాదికి 25 లక్షలు సంపాదించుకునే అవకాశం ఇస్తానని, ధనార్జన ఆశ చూపించి, వారందరినీ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా పనిచేసేలా చేసిన మేధావిగా ఘనత సంపాదించుకున్నాడు. ఇప్పుడంటే రాజకీయ పార్టీలు రిసార్ట్ & హోటల్ రాజకీయాలు చేస్తున్నాయి కానీ ఇలా శాసన సభ్యులను రెచ్చగొట్టి హోటల్ కి తరలించే రిసార్ట్ రాజకీయాలను పరిచయం చేసిన ఘనత చంద్రబాబుదే. అలాగే మూతపడివున్న భువనేశ్వరి కార్బైడ్ ఫ్యాక్టరీని రేణుకా చౌదరికి అంటగట్టి, అందుకు ప్రతి ఫలంగా ఆమెకు రాజ్యసభ సీటు ఇప్పించాడు.
40ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. తెలంగాణలో ఓటుకు నోటు ఇస్తూ అడ్డంగా దొరకడమే కాకుండా, 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ శాసన సభ్యులని అక్రమంగా సంతలో పశువులని కొన్నట్టు కొన్నారు. అలాగే కోట్ల రూపాయలకు రాజ్యసభ సీట్లను అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుదని ఆ పార్టీ వాళ్ళే ఆరోపించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.
తాజాగా కేశినేని నానికి దక్కాల్సిన ఎంపీ సీటును ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి 150 కోట్లకు అమ్మారనే ప్రచారం జోరుగా సాగుతుంది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని ఎదుర్కొని కూడా విజయం సాధించిన అతి కొద్దిమంది టీడీపీ నాయకుల్లో కేశినేని నాని ఒకరు. కానీ ఇప్పుడు ఆయనకే టికెట్ లేదని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. ఇందుకు ఎంపీ సీటుకు 150 కోట్లు డిమాండ్ చేయడమే ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. పార్టీకి విధేయుడిగా ఉన్న తనకు ఎంపీ సీటు కొనుక్కునే దౌర్భాగ్యం పట్టలేదని కేశినేని నాని తేల్చి చెప్పడంతో, వేలంలో ఆ సీటుని కేశినేని చిన్ని దక్కించుకునట్టు తెలుగుదేశం పార్టీ అంతర్గత వర్గాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ సీట్ల అమ్మకాల వెనుక చంద్రబాబు తనయుడు లోకేష్ హస్తం కూడా బలంగానే ఉందనేది మరో వాదన.
ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ పార్టీలను వ్యాపార సంస్థలుగా మార్చి, ఇంతింతై వటుడింతై అన్న చందంగా, డబ్బుతో ఎంపీలను, ఎమ్మెల్యేలను కొనడం అమ్మడం అనే ప్రక్రియ రాష్ట్రంలో మొదలుపెట్టి, తన ధనార్జన కీర్తి కిరీటాన్ని దేశమంతా తెలిసేలా చేసుకున్న ఘనుడు చంద్రబాబనే సెటైర్లు మరోసారి సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి.