ఎన్నికలు తేదీ దగ్గర పడుతున్న సందర్భంలో చంద్ర బాబు కొత్త తలనొపులు ఎదురు అవుతున్నాయి. టిడిపి సీనియర్ నేత పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అలక చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. కూటమిలో భాగంగా పెందుర్తి సీటును బండారు సత్యనారాయణమూర్తికి కాకుండా తన ప్రత్యర్థి ఆయన జనసేన నేత పంచకర్ల రమేష్ బాబుకి కూటమి తరపున సీట్ కేటాయించారు. సీట్ కేటాయించి మూడు వారాలు కావస్తున్నా సత్యనారాయణమూర్తి ఇంటి నుంచి బయటికి కదలడం లేదు. పంచకర్ల రమేష్ బాబుకి మద్దతుగా ఎటువంటి ప్రచారాలు, నాయకుల సమన్వయం ఏమి చేయకుండా సైలెంట్ అయిపోయాడు. టిడిపి అధినేత ఎన్నో మార్గాలు ద్వారా రాజీ చేయాలని ప్రయత్నించినా సత్యనారాయణ మూర్తి ఒప్పుకోలేదు. చివరికి నిన్న చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో ప్రచార సభలో పాల్గొనడానికి వెళ్ళాడు, అక్కడికి బండారు సత్యనారాయణమూర్తి రమ్మని కోరగా .. బండారు వెళ్లారు. చంద్రబాబు క్యారవాన్ లో సత్యనారాయణమూర్తిను బుజ్జగించాలని ప్రయత్నించగా సత్యనారాయణ మూర్తి వినక పోయేసరికి సత్యనారాయణమూర్తి పై చంద్రబాబు నాయుడు కోపోద్రిక్తుడయ్యాడు. పది నిమిషాల తర్వాత బండారు సత్యనారాయణమూర్తి చంద్రబాబునాయుడుకి దండం పెడుతూ క్యారవాన్ దిగి తన వాహనంలో ఇంటికి వెళ్లిపోయాడు.
మరోవైపు కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్సిపి లో జాయిన్ కావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. కమలాపురం నియోజకవర్గ టికెట్ ఆశించిన వీర శివారెడ్డికి టికెట్ దక్కలేదు. వీర శివ రెడ్డి అన్న కుమారుడు అయినా ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డికి ప్రొద్దుటూరు టికెట్ ఇస్తాం అని ప్రకటించి, టికెట్ వరదరాజులు రెడ్డికి ఇవ్వడంతో వీర శివారెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. గుర్తింపు గౌరవం దక్కనిచోట మేము పని చేయలేము అని వీర శివారెడ్డి తన అనుచరులతో వాపోయారు. రెండు మూడు రోజుల్లో టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్సిపిలో చేరుతున్నట్లు తన అనుచర వర్గానికి ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం.
అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంకి చెందిన ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి ఇటీవల వైఎస్ఆర్సిపిని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాడు. టిడిపిలోకి వెళ్లే రెండు వారాలు కూడా గడవకమునుపే ఆ పార్టీలో ఇమడలేను అంటూ నెల్లూరు వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమక్షంలో తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇలా ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో కీలక నేతలు పని చేయకుండా పోవడం, ఇతర పార్టీలోకి వెళ్లి పోతుండడంతో చంద్రబాబు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు.