చంద్రబాబు అవకాశవాది రాజకీయం ఎలా ఉంటుందో నాలుక మడతల ధోరణి ఏ రకంగా ఉంటుందో రాష్ట్ర రాజకీయాలు తెలిసిన వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏదైనా తను మాత్రమే చేయగలడు తనకు మాత్రమే సాధ్యం అనుకుంటాడు చంద్రబాబు.. తను తప్పితే ఎవరూ చేయలేరని అహంభావం చంద్రబాబుకే సొంతం… ఇంకెవరైనా చేసిన ఓర్వలేని అసహనం కూడా చంద్రబాబు నైజంలో భాగమే.. ప్రజలకు మంచి జరిగే విషయంలో అయితే చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించడానికి అయినా వెనుకాడడు అనేది చరిత్ర చెబుతున్న నిజం.
విషయానికి వస్తే… గత 2019 ఎన్నికలలో జగన్ తన ఎన్నికల హామీలలో భాగంగా 45 ఏళ్లు నిండిన మహిళలకు పెన్షన్ అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ హామీ అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా రోజువారి కూలీలుగా, రోడ్లమీద బండ్ల మీద చిరు వ్యాపారులుగా జీవనం సాగించే రెక్కాడితే గాని డొక్కాడని పేద మహిళలను దృష్టిలో పెట్టుకుని 45 ఏళ్లకే పింఛన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలిపారు. ఈ హామీపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమైనప్పటికీ కూడా చద్ది పార్టీలు మాత్రం కక్షగట్టాయి. గతంలో జగన్ ఇచ్చిన 45 ఏళ్లకే పింఛన్ హామీని, చంద్రబాబు ఎల్లో మీడియా, అనుబంద విభాగాల ముసుగులో వక్రీకరించి 45 ఏళ్లకే ముసలి వాళ్ళని చేస్తారా అంటూ తప్పుడు ప్రచారాలు చేసారు.
అయితే రోజంతా కష్టపడి కాయకష్టం చేసుకుని శ్రమ పడే మహిళలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో చేసిన ఈ అంశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేలాగా తప్పుడు కథనాలతో పక్కదారి పట్టించారు. కానీ ఇప్పుడు రేపు జరగబోయే 2024 ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు అదే హామీని 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తానంటూ డబ్బా కొడుతున్నాడు. 45 ఏళ్లకు పెన్షన్ ఇస్తే ముసలి వాళ్ళ అని అడిగిన చంద్రబాబు 50 ఏళ్లకు ఇస్తానని అర్థం ఉందా? గతంలో జగన్ కి సాధ్యం కానిది చంద్రబాబుకు ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఈ అంశం పై జగన్ చేస్తానంటే తప్పు అన్నది ఈరోజు నువ్వు చేస్తానంటే ఒప్పు ఎలా అవుతుంది చంద్రబాబు అంటూ ప్రజలతో పాటూ రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు.