చంద్రబాబుకు ఎన్డీఏ పూర్తిగా డోర్లు క్లోజ్ చేసేసిందని అమిత్ షా అన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటని రిపోర్టర్ అడిగితే అందుకు బాబు డోర్లు తెరవాలని ఎవరు అడిగారు. అతను ఏదో అనుకుంటున్నాడు. ఢిల్లీలో పవర్ ఉందని ఏది పడితే అది మాట్లాడితే ఎలా.. నేను డోర్లు తెరవాలని అడిగానా.. ఆయన ఆటిట్యూడ్‌ను ఖండిస్తున్నా.
2019 ఎన్నికల సమయంలో కమలం పెద్దలు నరేంద్రమోదీ, అమిత్‌షాపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. ఎన్డీఓ ఓడిపోయి దేశంలోని పలు పార్టీల సహకారంతో ప్రధాని అయిపోతానని నారా వారు కలలు కంటూ నోటికి ఏదొస్తే అది అనేశారు. మళ్లీ 24 ఎన్నికల్లో అదే బీజేపీతో పొత్తు కోసం కాళ్లబేరానికి దిగారు.
చంద్రబాబు జిత్తులమారి తెలివి గురించి బాగా తెలిసిన బీజేపీ పెద్దలు ఆయనకు అనేక షరతులు విధించారని తెలిసింది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలిసి మాట్లాడారు. గతంలో అన్న మాటలు పట్టించుకోవద్దని, క్షమాపణలు కోరి ఇప్పుడు ఏమి చెప్పినా చేస్తానని తలదించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కమలం నేతలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నాలుగు సీట్లు టీడీపీకి, రెండు జనసేనకు, ఒకటి బీజేపీకి ఇవ్వాలని ప్రతిపాదించారంట. వారి షరతుల ప్రకారం చూస్తే టీడీపీకి వంద అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలు మాత్రమే మిగులుతాయి. అన్ని సీట్లు ఇచ్చేందుకు ఇష్టపడటం లేక బాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం.
నిజానికి బాబు సేనకు 15 నుంచి 20, బీజేపీకి 10 నుంచి 12 అసెంబ్లీ, చెరో రెండు ఎంపీ స్థానాలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని అనుకున్నారు. పలుమార్లు పొలిట్‌బ్యూరో సమావేశాల్లో సీనియర్ నాయకులు ఇదే చెప్పారు. అయితే సేనాని పవన్ కళ్యాణ్‌లా బీజేపీ అధిష్టానం తలూపలేదు. బాబు ఊసరవెల్లి నైజాన్ని గుర్తుపెట్టుకుని అధికంగా సీట్లు కావాలని షరతు విధించింది. దీంతో తెలుగు తమ్ముళ్లకు షాక్ కొట్టినట్లయింది. ఢిల్లీ వెళ్లి రోజులు గడుస్తున్నా ఇంకా ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో నారా వారు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. పవన్ చేత రాయబారం చేయించాలని ప్రయత్నించానా ఉపయోగం లేకుండా పోయింది.
బీజేపీతో పొత్తు టీడీపీకి చాలా అవసరం. కానీ కమలం పెద్దలకు కాదు. అదే జనసేన విషయానికొస్తే దీనికి చంద్రబాబుతో పొత్తు కావాలి. ఈయన మాటలకు బీజేపీ ఓకే అంటే సరే.. లేక సంబంధం అవసరం లేదు. బాబుకేమో ఇద్దరితో పొత్తు కావాలి. దీంతో ఈ వ్యవహారం తేలడలంలో ఆలస్యమవుతోంది. ప్యాకేజీ ఇస్తున్న నేపథ్యంలో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే అని సేనాని చెబుతున్నారు. అయితే కాపు సంక్షేమ సేన నాయకుడు హరిరామజోగయ్య పవన్‌కు లేఖలు రాస్తూనే ఉన్నారు. అధికంగా సీట్లు అడగాలని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ నాయకులు తెలుగుదేశంతో పొత్తును ఇష్టపడటం లేదు. ఇటీవల పురందేశ్వరి నిర్వహించిన సమావేశాల్లో వారు తెగేసి చెప్పారని సమాచారం. అయితే సోదరి భర్త కోసం పనిచేస్తున్న ఆమె మాత్రం అధిష్టానానికి పొత్తు ఇష్టమే అనే విధంగా నివేదిక ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇందులో గతంలో టీడీపీలో ఉండి తర్వాత కమలం గూటికి చేరిన సీఎం రమేష్, సుజనా చౌదరి పాత్ర ఉందని తెలిసింది. ఈ గ్యాంగ్ అంతా ఏపీలో టీడీపీతో కాపురానికి బీజేపీని ఒప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే పెద్దలు సీట్ల విషయంలో మెలిక పెట్టేసరికి అందరి నోర్లు మూగబోయాయి. అందుకే పురందేశ్వరి, సత్యకుమార్ అంతా అధిష్టానం ఇష్టమని చెబుతున్నారు. వారికి నచ్చకుండా మాట్లాడితే ఎక్కడ తమ పదవులకు ఎసరు వస్తుందోనని భయం. బాబు ఈ 4–2–1 ప్రతిపాదనకు ఒప్పుకునేది అనుమానమే. చాలామంది తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం మాట వినే పరిస్థితిలో లేరు. అందరికీ సర్ధి చెప్పే సామర్థ్యం లోకేశ్‌కు లేదు. దీంతో టీడీపీ అధినేతకు బీపీ పెరిగిపోతోంది. అందుకే జగన్‌లా ధైర్యంగా జనాన్ని నమ్ముకుని ఒంటరిగా బరిలోకి దిగితే చావోరేవో తేలుతుంది. అలా కాకుండా అష్ట వంకర్లు తిరిగితే పరిస్థితి ఇలాగే ఉంటుంది.