దేశంలోనే అత్యధిక ఆర్థిక వనరులున్న పార్టీ టీడీపీ. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తాను లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. అంతే కాకుండా తన మనుషులకు దోపిడీ చేసే అవకాశమిచ్చారు. విద్యాసంస్థల యజమానులు, కాంట్రాక్టర్లు, సినిమా నిర్మాతలు, రియల్టర్లు, బడా పారిశ్రామికవేత్తలు ఆ పార్టీకి చాలా ఏళ్లుగా అండగా ఉన్నారు. అయినా చంద్రబాబు తమది పేద పార్టీ అని, ప్రజలు డబ్బులివ్వాలని బిల్డప్ ఇస్తుంటారు. గతంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో పార్టీలకు ఫండింగ్ చేసిన చరిత్ర నారా వారిది. ఆయన ఇప్పుడు ప్రజల్లో సింపతీ కోసం కొత్త నాటకానికి తెరతీశారు.
టీడీపీకి విరాళాలు ఇవ్వండంటూ మంగళవారం చంద్రబాబు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. తొలి చందాగా రూ.99,999 రూపాయల విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్ఆర్ఐల కోసం సైట్లో అవకాశం కల్పించినట్లు ఈ సంరద్భంగా బాబు తెలిపారు. విరాళాలిచ్చిన వారికి రశీదులు ఇస్తామన్నారు. అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు న్యాయపరంగా అనుమతి ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల దగ్గర నుంచి తాము విరాళాలు సేకరిస్తున్నామని చెప్పారు. దీని వెనుక మతలబు ఉంది. రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీంతో బాబు దుకాణం తెరిచారు. తాము అక్రమంగా సంపాదించుకున్న డబ్బును వైట్ చేసుకునేందుకు తెలివిగా అడుగులు వేస్తున్నారు. బాబే తన అక్రమ సంపాదనను వివిధ సంస్థలు, పలువురికి ఇచ్చి వాటిని పార్టీకి విరాళాల రూపంలో సేకరించే అవకాశముంది. దీంతో పన్ను మినహాయింపు వచ్చి ఆ డబ్బు మొత్తం తిరిగి బాబు జేబులోకే వెళ్తుంది.
ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలని ఎన్ఆర్ఐలను బాబు కోరారు. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగమని వెల్లడించారు. ఎన్ఆర్ఐల్లో ఓ సామాజికవర్గం వారే అధికంగా ఉన్నారు. వాళ్లు టీడీపీ చాలా ఏళ్లుగా ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నారు. మరి ప్రత్యేకంగా ఈ పిలుపు ఇవ్వడం ఏమిటో.. పనిలో పనిగా బాబు వైఎస్సార్సీపీ విరాళాలపై ఇష్టమొచ్చింది మాట్లాడారు. తెలుగుదేశానికి 279 ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.218 కోట్లు విరాళాలు వచ్చినట్లు ఇటీవల వెల్లడైంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందిన వారంతా బాండ్లు కొనుగోలు చేశారు. ఇంకా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 2019 ఏప్రిల్‌లో 19 బాండ్లు రూపంలో రూ.7.30 కోట్లను పార్టీ అందుకుంది. రూ.ఒక కోటి కంటే తక్కువ విరాళాలు వచ్చినవి 32 ఎంట్రీలున్నాయి. బీజేపీలో ఉన్న చంద్రబాబు మనిషి సీఎం రమేష్‌కు చెందిన కంపెనీ రిత్విక్ ప్రాజెక్టు నుంచి తెలుగుదేశానికి భారీగా డబ్బు వచ్చింది. రామోజీరావు సమీప బంధువుల కంపెనీ అయిన భారత్ బయోటెక్ నుంచి రూ.10 కోట్లు తీసుకుంది. చేయాల్సిన అక్రమాలన్నీ చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద పడి ఏడ్చారు బాబు.