వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తే రానున్న ఎన్నికల్లో తమకు డిపాజిట్ లు కూడా దక్కవేమో అనే భయంతో వారు వారి విధులను నిర్వర్తించకుండా చేయగలిగారు. అంతలోనే అది తమ మెడకు పాషాణమవ్వడం తో దిక్కుతోచక డిఫెన్స్ లో పడిపోయారు టీడీపీ అండ్ కో…
ఇప్పుడు వారు, వారి అనునాయులు కొత్తవాదన ముందుకు తెచ్చారు. వాలంటీర్లు లేకపోతేనేం సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా? వారితో ఇంటింటికీ పెన్షన్లు ఇప్పించే కార్యం మొదలు పెట్టండి అని. ఈ విషయం లో ఈనాడు ఓ పదడుగులు ఒక్క ఉదుటన దూకేసి సచివాలయాల్లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? వారు ఒక్కొక్కరికి ఎంత మందికి పెన్షన్ ఇవ్వగలరు. అలా ఇస్తే ఎన్ని రోజుల్లో ఇవ్వొచ్చు అనే లెక్కగట్టి పొద్దునే కరపత్రాలు విడుదల కూడా చేసింది.. మొత్తానికి వారు చెప్పొచ్చేది ఏమిటంటే. సచివాలయ ఉద్యోగుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వాలి…
వాలంటీర్లు అంటే తమ గ్రామంలోని తమ వీధిలోని 50 ఇళ్లకు ప్రతినిధి. అంటే ఆ 50 ఇళ్లలో ఎవరు ఉంటారు, వాళ్ల వయసేంటి? వాళ్ల పేర్లు ఏంటీ? అనే ఇలాంటి బేసిక్ సమాచారం అంతా తెల్సి ఉంటుంది. అందులో వాళ్ల సొంత బంధువులు కూడా ఉండే అవకాశం కూడా ఉంది. లేకపోతే అన్నా, అక్క, బాబాయ్, పెద్దమ్మ, అత్త అంటూ వరస పెట్టి పిలిచుకునే స్వాతంత్ర్యత ఉన్నవారే అయ్యుంటారు. కాబట్టి ఏ ఏ గృహం లో ఏ పథకానికి లబ్దిదారులు ఉంటారు అనే ప్రాథమిక సమాచారం వారి వద్ద ఉంటుంది, దానితో వారి డైరెక్ట్ గా ఇంటికివెళ్లి పెన్షన్ ఇచ్చి రాగలరు.. కానీ సచివాలయ ఉద్యోగులు అలా కాదు. ప్రభుత్వ నియామక పరీక్ష ద్వార ఎంపిక అయిన వారు. వారు ఆ గ్రామానీకే చెందిన వారు అయ్యుండాలనే గ్యారెంటీ లేదు. అధిక శాతం ఆ గ్రామానికి చెందని వారే అయ్యుంటారు. అలాంటి వారు పలానా వారికి పిన్షన్ ఇవ్వాలి అంటే వారిని వెతుక్కుంటే ఎంత మంది ఇంటికి అని వెళ్లగలరు? ఆఫీస్ లో డెస్క్ జాబ్ చేసే వారికి లబ్దిదారుల ఇల్లు ఎక్కడుంటాయి అనే అవగాహన ఎలా ఉంటుంది? అలా వెతుకుంటే వారు ఊరందరికీ పెన్షన్ పంచే లోపే నెల గడిచిపోతుంది.. ఇది కాస్త మెదడు ఉన్న వారికైనా అర్థం అయ్యే లాజిక్కే. కానీ టీడీపీ కి ఆ లాజిక్స్ ఏం ఉండవు. ప్రజలు కష్టపడాలి అంతే..
ఇక మరో మేధావి మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ వాలంటీర్లను బదిలీ చేయమని సలహా ఇచ్చాడు. ఒక ఊరి నుండి మరో ఊరికి బదిలీ చేస్తే ఇబ్బంది ఉండదట, పెన్షన్ లు కూడా ఆగవట. ఆయన పరధ్యానం లో ఉండి అన్నారో, లేక టీడీపీ కి వంతపాడాలి అనే ఉద్దేశం తో అన్నారో గానీ దీనంత వితండ వాదం ఇంకొకటి లేదు. 5 వేలు జీతం తీసుకునే, సర్వీస్ రూల్సే లేని “స్వచ్ఛంద వ్యక్తులు” బదిలీ చేశాం పక్క ఊరికి వెళ్లండి, పక్క జిల్లాకు వెళ్ళండి అంటే వెళ్తారా? వారేమైనా ప్రభుత్వ ఉద్యోగులా? బదిలీ చేసాం కాబట్టి వెళ్ళాల్సిందే అంటే వెళ్లడానికి. అయినా 2.5 లక్షల మందిని ఒకేసారి బదిలీ చేయడం అంత సులువా? ఇలా ఉంది ఆయన విషయ పరిజ్ఞానం..