నిన్న జరిగిన ప్రజాగళం సభలో ఒకే విషయం పై మోదీ, చంద్రబాబులు రెండు వేర్వేరు విమర్శలు చేశారు. రెండు విమర్శలు ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నాయి. అదేమిటనగా….
జగన్ కు ఓటెయ్యొద్దని సొంత చెల్లెళ్లే చెప్తున్నారు, షర్మిల కు జగన్ అన్యాయం చేశాడు, సొంత ఇంట్లో వాళ్లే జగన్ ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి అని బాబు ప్రసంగించగా, కొద్దిసేపటికే మైక్ అందుకున్న మోదీ అనేకసార్లు మైక్ అంతరాయం, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరణ ఇస్తూ, జగన్ మీద చేసిన ఏకైక విమర్శ ” కాంగ్రెస్, వైసీపీ ఒకటే, రెండు పార్టీలను రాష్ట్రంలో నడిపేది ఒకే కుటుంబం వారు, ఆ ఇద్దరూ ఒకటే” అని ఇది వింటున్న బాబు కూడా చప్పట్లు చరిచాడు… జగన్, షర్మిలలు వేరు వేరు అని బాబు చేసిన విమర్శ నిజమా, లేక వారిద్దరూ ఒకటే అని మోదీ చేసిన విమర్శ నిజమా? అందులోనూ మోదీ స్టేట్మెంట్ కు బాబు కూడా చప్పట్లు చరిచాడు. మరి ఈ రెండిట్లో ఏది నిజం?
ఏదైనా… కూటమిలో ఏ పార్టీ కి ఒక నిర్దిష్ట అవగాహన లేదని, ఒకే మాట మీద ఉండాలి అనే కమిట్మెంట్ లేదని నిన్నటి సభతో టీడీపీ క్యాడర్ తో సహా అందరికీ అర్థం అయింది.. ఇక మున్ముందు వారి కూటమి బంధం ఇంకెంత అద్వానంగా తయారవుతుందో వేచి చూడాలి..