సాగినంత కాలము నా అంత వారు లేరందురు, సాగక పోతే ఊరక చతికిల బడి పోదురు.. మాయా బజార్ లో మామ పాడిన పాట అల్లుడు బాబుకి బాగా సరి పోతుంది. టీడీపీ ప్రభుత్వం అధికార్మలో లేనపుడు, బాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి మీద ఆదాయపు పన్ను శాఖ వారిద్దరి అక్రమ వ్యవహారాలపై కేసు నమోదు చేసింది. చిత్తూరు జిల్లాలోని శ్రీ భువనేశ్వరి కార్బైడ్స్ అండ్ కెమికల్స్ మీద ఆదాయ పన్ను శాఖ నమోదు చేసిన కేసులోని నిందితుల జాబితాలో దంపతులిద్దరి పేర్లూ ఉన్నాయి.
1991 లో ఈ కేసు నమోదైంది. సరైన కారణాలు లేకుండా ముగ్గురు వ్యక్తుల నుంచి రెండు లక్షల రూపాయల నగదు డిపాజిట్లను స్వీకరించినట్టు ఆ సంస్థ డైరెక్టర్ నారా రామ్మూర్తి నాయుడు ఆదాయ పన్ను రిటర్న్స్ లో చూపినట్టు అధిరాకారులు గుర్తించి దానిపై షోకాజ్ నోటిస్ పంపగా, సంతృప్తి కరమైన వివరణ రాక పోవడంతో శాఖ అధికారులు , ఆదాయ పన్ను శాఖ సెక్షన్ 276 డిడి కింద చార్జి షీటు దాఖలు చేశారు.
సుదీర్ఘ కాలం ఈ కేసు విచారణ కొనసాగింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అయిదు నెలలకే బాబు, అతని భార్య భువనేశ్వరి పేర్లను ఈ కేసు నుంచి తొలగించారు.
కంపెనీ వ్యవహారాల పై నియంత్రణ గానీ, దైనందిన లావాదేవీల్లో వారి ప్రమేయం గానీ ఉన్నట్టు శాఖ ఆరోపించక పోవడంతో వారి పేర్లను చార్జ్ షీటు నుంచి తొలగించాలని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయ మూర్తి సీతాపతి ఆదేశాలు జారీ చేశారు.
విచారణ జరిగిన సుదీర్ఘ కాలంలో కోర్టు కి ఈ అంశం తట్టలేదనీ, బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తట్టిందనీ సామాన్యుడు అనుకోవడంలో తప్పు లేదు.