ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చదువుకునే పేద పిల్లలు మరింత ఉన్నంతగా రాణించాలని, అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలన్న సమున్నత లక్ష్యంతో అందిస్తున్న ట్యాబుల పైన ఈనాడు రాసిన వికృత రాతలు.
ప్రభుత్వం పిల్లలకు ఇస్తున్న ట్యాబుల వల్ల చదువులకు నష్టం జరుగుతుందంటూ, ట్యాబులపై తల్లీదండ్రుల విముఖత అన్నట్లు కథనాలు ప్రచురించింది. అయితే ఇదే ప్రధమం కాదు.. పేదపిల్లలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక సంస్కరణలపై నిత్యం ఈనాడు దినపత్రిక తప్పుడు ప్రచారాలు చేస్తూ, వక్రీకరణలు చేస్తూనే ఉంది.
పేదలు పేదలుగానే ఉండాలని, వారికి మంచి చదువులు, నాణ్యమైన చదువులు అందడం ఇష్టం లేదన్నట్టుగా కథనాలు రాస్తూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం చదువులు వద్దంటూ పేదలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడిపిన ఈనాడు దినపత్రిక.. ఇప్పుడు ఈ కొత్తరకం డ్రామాను ప్రజల్లో ప్రదర్శిస్తుంది. టీడీపీ పార్టీకి కొమ్ముకాసే ఈనాడు పత్రిక రాష్ట్రంలో జరుగుతున్న చదువుల పండగను చూసి ఓర్వలేకపోతుంది. ప్రైవేటు పాఠశాలల్లో కూడా అందని నాణ్యమైన విద్య రాష్ట్రంలో ప్రభుత్వ విద్యార్థులకు డిటిజల్ రూపంలో ట్యాబుల ద్వారా అందుతుంటే టీడీపీ పార్టీ, వారి అనుకూల మీడియా అక్కసు వెళ్ళగక్కుతుంది.
ప్రపంచం వేగంగా టెక్నాలజీతో ముందుకెళుతున్న సమయంలో రాష్ట్రంలో విద్యార్ధులు బయట పోటీ ప్రపంచంలో పోటీపడేందుకు పాఠశాల స్థాయి నుండే శిక్షణ అవసరం. అదే ఆచరణలోకి తెచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులు ప్రపంచస్థాయి పోటీని తట్టుకోని దీటుగా ఎదిగేందుకు ట్యాబులు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రభుత్వం వాటిని పంపిణీ చేసింది. విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకోవడానికి, పునశ్చరణకు, మెరుగైన బోధనలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను పంపిణీచేసింది.
2021–22 విద్యా సంవత్సరంలో 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌తో 5.18 లక్షల ట్యాబ్‌లను 2022, డిసెంబర్ 21న ప్రభుత్వం పంపిణీ చేసింది, ట్యాబ్‌ల పంపిణీ కోసం రూ.660 కోట్లను ఖర్చు చేసింది. పిల్లలు పాఠాలు నేర్చుకునేందుకు వీలుగా బైజూస్ యాప్ డిక్షనరీ, సందేహాల నివృత్తికి మరో యాప్, ఏపీ ఈ–పాఠశాల యాప్‌లను ట్యాబుల్లో ఇన్స్టాల్ చేసి విద్యార్థులకు, టీచర్లకు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఏ పోటీ పరీక్షనైనా ఎదుర్కొనేందుకు వీలుగా విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు ఈ ట్యాబ్స్‌ను అందించారు.
ఈ ఏడాది కూడా మరో 4.35 లక్షల ట్యాబ్‌లను ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందించనున్నారు. ఈ ఏడాది నుంచి విద్యార్థులు వారికి ఇష్టమైన విదేశీ భాషను నేర్చుకునేందుకు డ్యూలింగో యాప్‌ను ట్యాబుల్లో అదనంగా చేర్చారు. చదువుల్లో టెక్నాలజీ భాగమవ్వడం ఎంత ముఖ్యమో అర్ధం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చేతికి ట్యాబులు ఇచ్చేసి చేతులు దులుపుకోలేదు. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తూ ఉండేలా చర్యలు తీసుకుంది.
ఎల్లోమీడియా వక్రరాతలకు వికృత బుద్ధికి ఈ సంగతి తెలియనిది కాదు.. కానీ ప్రభుత్వం చేస్తున్న మంచి ఆలోచనను సమర్ధించడం వారికి చేతకాని పని.
పిల్లలు ట్యాబులను విధ్యేతర పనులకు వాడకుండా రాష్ట్ర పభుత్వం వారు ప్రతి ట్యాబులో కూడా మొబైల్ డివైస్ మేనేజ్మెంట్(MDM)ను పొందుపరిచారు. దీనివల్ల విద్యార్థులకు అవసరమైన 5 యాప్స్‌ను మాత్రమే అందులో పనిచేసేలా MDMను తీర్చిదిద్దారు. ఈ ట్యాబుల్లో MDM ఉండడం వలన వాటిలో నిర్దేశించిన 5 యాప్స్ తప్ప మిగిలినవి పనిచేయవు.
కానీ ఉద్దేశపూర్వకంగా బలవంతంగా రీసెట్ చేసి, మరో యాప్‌ను డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నించినా ఇంటర్నెట్ కనెక్ట్చసిన మరుక్షణమే సంబంధిత ట్యాబ్ లాక్ అయిపోతుంది. ఏ విద్యార్థి ట్యాబులో ఇతర యాప్సు డౌన్లోడ్ చేయడం లేదా, ఇతరత్రా కార్యకలాపాలకు వాడుకున్న విషయం సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలుస్తుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాత్రమే గూగుల్ అథంటికేటర్ ద్వారా వారికి వచ్చిన ఓటీపీ ద్వారా ఆ టాబ్ ను తిరిగి ఓపెన్ చేయగలరు. మిగిలిన వారికి ఎవ్వరికీ కూడా ట్యాబ్‌ను ఓపెన్ చేయడం సాధ్యంకాదు. ఈ విధంగా ట్యాబుల నిర్వహణలో మూడంచెల రక్షణ వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.
ట్యాబుల నిర్వహణలో ఏమైనా లోపాలు వస్తే ఏం చేయాలన్నదానిపై విద్యాశాఖ దీనిపై సమర్థవంతమైన ఎస్ఓపీని రూపొందించుకుంది. ట్యాబుల్లో ఏమన్నా లోపాలు ఉన్నట్లయితే ప్రతి పాఠశాలలో ఇదివరకే దీనిపై శిక్షణ తీసుకున్న ఇద్దరు ఉపాధ్యాయులు వెనువెంటనే సరిచేసి ఇస్తారు. హార్డ్‌వేర్ సమస్యలు ఉంటే సరిదిద్దడానికి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ కు శిక్షణ ఇవ్వడం జరిగినది. లోపాలు ఉన్న ట్యాబ్ ను విద్యార్థి గాని లేదా విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైనా సమీప సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ కు అందజేస్తే తగిన రసీదు ఇచ్చి ఆ ట్యాబును సరిచేసి మూడు రోజుల్లో తిరిగి అందజేస్తున్నారు.
విద్యార్థులు ఆన్లైన్లో చదువుకోవాలంటే చాలా ఎక్కువ సిలబస్ ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీని కోసం నిష్ణాతులైన ఉపాధ్యాయులతో కంటెంట్ ను తయారు చేయించడం ద్వారా సిలబస్ అంతా ట్యాబుల్లో పిల్లలకు అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు వారికి సంబంధించిన పాఠ్యాంశాలు సులభంగా అర్థం చేసుకోగలరు. వారి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సంపన్నుల పిల్లలు మాత్రమే అందుకునే ఉత్తమ విద్య పేదలకు లభిస్తుంటే.. ఈనాడు మాత్రం తప్పుడు రాతలతో ఇలా విషం కక్కుతూనే ఉంది.
గవర్నమెంట్ స్కూల్ పేద పిల్లలు అమెరికన్ ఇంగ్లీషు యాక్సెంట్ లో మాట్లాడగలరని కానీ, చక్కగా యూనిఫామ్, బూట్లు వేసుకోని.. కార్పొరేట్ స్కూల్స్ కు దిటుగా నిర్మించబడిన ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి.. మధ్యాహ్నం పుష్టికరమైన భోజనం తిని చక్కగా చదువుకుంటారని ఎప్పుడైనా ఊహించామా.. అసలు ప్రైవేటు స్కూల్స్ మూతపడి ప్రభుత్వ పాఠశాలల ముందు సీట్లు అయిపోయాయనే బోర్డు పెట్టే రోజు ఎప్పుడైనా వస్తుందేమోనన్న ఆలోచన ఏ ప్రభుత్వంలోనైనా కలిగిందా.. కలలుగా ఉన్న అన్నిటినీ నిజాలుగా మారుస్తూ రాబోయే పదేళ్ళలలో ఒక తరాన్ని సృష్టిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పిల్లల చదువు గురించి ముఖ్యమంత్రి కలలు కనడం, పేద పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి స్థానం లో కూర్చున్న వారి మేనమామ మురిసిపోవడం చరిత్రలో ఎన్నడూ చూడనిది.
ఇంగ్లీషు మీడియం నుంచి, నాడు -నేడు పనులు, స్కూళ్ల పర్యవేక్షణ, ఉపాధ్యాయులకు శిక్షణ, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు, బైలింగువల్ టెక్స్ట్ బుక్స్, ట్యాబులు, ఐబీ విద్యావిధానం, విద్యా కానుక ఇలాంటి విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లను అత్యుత్తమకంగా తీర్చుదిద్దుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడు దినపత్రిక నిరంతరం రాళ్లు వేస్తూనే ఉంది.
ఈరోజు రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలందరూ మెరుగైన విద్యను అభ్యసిస్తున్నారంటే దానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చరిత్రలో ఎన్నడూ చూడని చదువుల విప్లవాన్ని ఆయన పరిపాలనలోనే చూస్తున్నాం. రానున్న రోజుల్లో రాబోతున్న భవిష్యత్తును ఊహించి.. పోటీ ప్రపంచంలో అవసరమైన విధంగా ఈరోజు ఆంధ్రప్రధేశ్ లో విద్యా బోధన జరుగుతుంది. ఏ మీడియా ఎంత వికృతంగా రాసినా పిల్లలను స్కూల్ కి పంపే ప్రతి తల్లికీ నిజం తెలుసు.