పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా తన పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తా అంటూ ఊరించి ఆ పై నియోజకవర్గానికి ఒక్కరోజుకే పరిమితం అని చివరకు ఒక రోజు ప్రచారం చేస్తే అనారోగ్య కారణాలతో నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలకు పనికీ వస్తారా, తమ తరుపున అసలు ప్రచారం చేస్తారా అంటూ లోలోపల తమ భవిష్యత్తు మీద భయంతో వణికిపోతున్నారు. పవన్ కళ్యాణ్ కూటమి పేరుతో మొదట టీడీపీ తో జతకట్టి తరువాత బిజెపి తో కలిసి 50 నుండి 24 అక్కడినుండి 21 సీట్లు తీసుకొని అభ్యర్థులను ప్రకటించడానికి తీరిగ్గా నెల రోజుల సమయం తీసుకున్నారు. మళ్ళీ వాటిల్లో మార్పుల చేర్పులు అని అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నారు. చివరకు చంద్రబాబు చెప్పిన వారికే టిక్కెట్లు ప్రకటించి ఇక ఎన్నికల ప్రచారం మొదలు అని మొదటి విడత షెడ్యూల్ ప్రకటించి షెడ్డులో దుమ్మూ ధూళి పట్టిన తన ప్రచార రథం వారాహీ వాహనం కు దుమ్మూదూళి దులిపి మొదట పిఠాపురంలో అడుగు పెట్టి ఒక రోజు సభ నిర్వహించి మరో రోజు గుడి, చర్చ్, దర్గా చుట్టు తిరిగారు, కానీ కీలకమైన ప్రచారం చేసే రోజు వచ్చేసరికి జ్వరం పేరుతో నాలుగు రోజులు పొరుగు రాష్ట్రమైన హైదరబాద్ కు పరిమితం అయ్యారు.
సరే మళ్ళీ ప్రచారం మొదలు పెడుతున్న అని కేవలం రెండు రోజులు రోజుకొక నియోజవర్గం అని ప్రకటించి నిన్న అనకాపల్లిలో రోడ్ షో గా వచ్చి ఒక సభలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ ,ఇక తన విడిదికి తిరుగు ప్రయాణంలో సొమ్మసిల్లి పడిపోయారు అని హైదరబాద్ కు తిరిగి వెళ్లిపొయ్యారు. ఇప్పుడు ఇదే జన సేన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాది. పవన్ కళ్యాణ్ అసలు ప్రచారాలకు వస్తారా లేక అనారోగ్యం పేరుతో పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్ లోనే వుండిపోతారా అంటూ లబోదిబోమంటున్నారు. మా తరుపున కనీసం రెండు రోజులు గ్రామ గ్రామానికి పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తారు అనుకుంటే పవన్ కళ్యాణ్ ఏమో కేవలం ఒకరోజు ప్రచారం అది నియోజకవర్గానికి ఒక సభ మాత్రమే అంటూ ఒకరోజు ప్రచారం చేసి నాలుగు రోజులు పొరుగు రాష్ట్రమైన హైదరాబాద్ లో వుంటూ మధ్యలో తను పోటి చేస్తున్న పిఠాపురంకే అధిక ప్రాధాన్యత ను ఇవ్వడం చూసి పోటి చెయ్యాలో లేక తప్పుకోవాలో అనే ఆలోచనలో పడ్డారు సగం మంది అభ్యర్థులు.
పవన్ కళ్యాణ్ తీరును పరిశీలించిన ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరాడు, ఒక్క రోజుకే ఇలా అనారోగ్యం పలు అయితే రేపటి రోజున ప్రజలకు ఎలా అందుబాటులో వుంటాడు అని మాట్లాడుకుంటున్నారు, ఇది జన సేన అభ్యర్థుల విజయాలను తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. పాపం పవన్ కళ్యాణ్ తన అభ్యర్థుల పాలిట గుదిబండై కూర్చున్నారు.