Burra Madhusudan : సీఎం జగన్ నా రాజకీయ దేవుడని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ వెల్లడించారు. కాగా ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కనిగిరిలో మధుసూదన్యాదవ్ని(Burra Madhusudan) కాదని కొత్త ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్‌ను వైఎస్సార్సీపీ నియమించింది. దీంతో ఆయన పార్టీ మారుతున్నట్లు ఓ వర్గం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ అంశంపై బుర్రా మధుసూదన్ యాదవ్ స్పష్టతనిచ్చారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కాదని ఎక్కడికీ వెళ్ళేది లేదని జీవితాంతం జగన్‌తోనే ఉంటానని తేల్చిచెప్పారు.
కనిగిరిలో వైఎస్సార్సీపీ విజయం కోసం పనిచేస్తామని కనిగిరి కొండమీద వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని, కొత్త ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్‌కు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. సీఎం జగన్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని ఎమ్మెల్యే సీటిస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలా ఉండనని చెప్పిన మధుసూదన్‌యాదవ్ నాకు ఇద్దరు దేవుళ్లున్నారని, వారిలో ఒకరు సీఎం జగన్, ఇంకొకరు వెంకటేశ్వరస్వామి అని తెలిపారు. నా రాజకీయ దేవుడు వైఎస్ జగన్ ఏం చెబితే అది చేస్తానని సామాన్య కుటుంబ నుంచి వచ్చిన తనకు రెండుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని వెల్లడించారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ తాజా ప్రకటనతో తాను పార్టీ వీడనున్నట్లు ఎల్లో మీడియాలో చేస్తున్న ప్రచారమంతా అసత్యమని తేలిపోయింది.