పిఠాపురం లో పోటీ చేయబోతున్న పవన్ కళ్యాణ్ బాబు తరహాలో హామీలు గుప్పించడం మొదలు పెట్టాడు. తాను పిఠాపురం లో ఇల్లు కట్టుకుంటానని, ఓడినా దశాబ్దం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నానని.. అలాగే తెలంగాణ లో పార్టీ పెట్టిన షర్మిల తన పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసింది కానీ తానింకా పార్టీ మూసెయ్యలేదని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చాడు…
ఇప్పుడు పిఠాపురం లో ఇల్లు కట్టుకుంటా అంటున్న పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నుకల్లో గాజువాక, భీమవరం నుండి పోటీ చేసినప్పుడు ఆ ప్రాంతాల్లో ఇల్లు ఎందుకు కట్టుకోలేదు. గతంలో ఇలాగే చాలా చోట్ల ఇల్లు కట్టుకుంటానని, వెళ్లిన ప్రతీ చోటా నేనిక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, ఇక్కడే చదువుకున్న అని వింత వింత ప్రకటనలు చేసి నవ్వుల పాలైనా పవన్ కల్యాణ్, ఈసారి తేరుకుని అనూహ్యంగా తనెక్కడ పుట్టాడో తనకే తెలియదు అన్నాడు. 60 ఏళ్ల వయసుకి దగ్గర పడుతున్న పవన్ కు తనెక్కడ పుట్టాడో తెలియకపోవడం ఎంత ఆశ్చర్యం. ఒక్కసారి తన మాతృమూర్తిని అడిగి ఉంటే ఆవిడ చెప్పుండేది కదా..
ఇక పవన్ కళ్యాణ్ హామీలను గుర్తు చేసుకుంటే భీమవరం లో అల్లురి సీతారామరాజు విగ్రహం కట్టిస్తానని వాగ్దానం చేసి ఐదేళ్లు గడిచింది. అలాగే రాయలసీమలో పర్యటన చేస్తూ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని ఇచ్చిన మాట నీటి మీద రాతలే అయ్యాయి. ఇక సీమలోనే లైబ్రరీ కడతా ఈ సీమ కి పౌరుషం తగ్గింది, గ్రంథాలు చదివి పౌరుషం తెచ్చుకోండి అని చెప్పి కూడా అర్ద దశాబ్ద కాలం గడిచింది.. కానీ ఇంతవరకు వేటికి దిక్కూ మొక్కు లేదు. ఇప్పుడు కొత్తగా పిఠాపురం లో ఇల్లు కట్టుకుంటానంటున్నాడు.. బాబు బినామీ అయిన లింగమనేని నుండి మంగళగిరి లో ఉచితంగా భూమి పొందిన పవన్ రేకుల షెడ్డు వేసి పార్టీ ఆఫీస్ అన్నాడు గానీ, పదేళ్లలో రాష్ట్రం లో ఎక్కడా స్థిరనివాసం ఏర్పాటు చేసుకోలేదు. 2019 కి ముందు ఏపీ లో ఓటు హక్కుకు నమోదు చేసుకున్నాడు. అది పవన్ చిత్తశుద్ధి.…
ఇక షర్మిల పార్టీ ని విలీనం చేయడానికి పవన్ పార్టీ విలీనం చేయకపోవడానికి పెద్దగా తేడా ఏమి లేదు. పవన్ పెట్టిన జనసేన బాబు టీడీపీ కి బినామీ పార్టీనే. 2014 లో పార్టీ పెట్టి పోటీ చేయకుండా బాబుకు మద్దతు ఇచ్చాడు. 2019 లో ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీల్చే ఉద్దేశం తో బాబు ఆదేశాలతో విడిగా పోటీ చేశాడు. ఇప్పుడు మళ్లీ ముష్టి 21 సీట్లలో బాబు చెప్పిన చోటే పోటీ చేస్తున్నాడు. ఆ 21 మందిలో సగం టీడీపీ వారే. మిగిలిన వాళ్లలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నది కూడా బాబే నిర్ణయిస్తాడు అనేది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు జనసేన అనే పార్టీ విలీనం చేస్తే ఏమీ చేయకపోతే మాత్రం ఏమి? రెండు ఒకటే కదా? జగన్ మీద ఈర్ష చూపడం తప్ప పవన్ చేసిన పోరాటం ఏమిటీ? వీకెండ్స్ లో అలా విజిటింగ్ కి వచ్చే పవన్ బలంగా నిలబడింది ఎక్కడ?