విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడతామని ఆయన వెల్లడించారు. రేపు గాజువాక పర్యటనకు వస్తున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ మీద వైఖరి ఏంటో చెప్పాలనీ జనం నిలదీయాలని స్టీల్ ప్లాంట్ పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
కూటమిలో ఉన్న టీడీపీ అభ్యర్థులు, నాయకత్వం స్టీల్ ప్లాంట్ మీద తమ వైఖరి చెప్పాలని సెంటిమెంటుతో కూడిన సున్నితమైన అంశాన్ని రాజకీయాలు చేయ్యొద్దని చెప్పుకొచ్చిన బొత్స, చంద్రబాబుకు నిర్దిష్టమైన విధానం, నిలకడైన మాటలేదని, వయసు, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో చంద్రబాబు అయోమయంలో ఉన్నాడని తెలిపారు. ఏ పార్టీ ఎవరినైనా అభ్యర్థిగా పెట్టుకోవచ్చని కానీ లాబీయిస్ట్ లను తెచ్చి పెట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదని లాబీయింగ్ చేసే సీఎం రమేష్ కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నానని, అనకాపల్లిలో క్యాష్ పార్టీ తప్ప టీడీపీకి బీసీ నేత దొరకలేదా? బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
జగన్ ఏదైతే చెప్తారో అదే చేస్తారు.. ఏదైతే చేస్తారో అదే చెప్తారు. నా రాజకీయ జీవితంలో జగన్ లాంటి మంచి నాయకుడిని చూడలేదు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణలో కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమాలను సమర్థవంతంగా కట్టడి చేశామని, టెక్నాలజీ ఆధారంగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.