ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న వైసీపీ మహిళ కార్యకర్తలను అడ్డుకొని మీరు వైసీపీతరుపున ఎలా ప్రచారం చేస్తారు, పాంప్లెట్లు ఎలా పంచుతారు అంటూ గొడవకు దిగి వారిని తీవ్రంగా బెదిరించి వారి చేతిలోని వైసీపీ పార్టీ ప్రచార సామాగ్రిని బలవంతంగా లాక్కొని చించి పడేసి తరిమి కొట్టారు బోండా రవితేజ . మహిళ కార్యకర్తలు ముఖ్యంగా యువత భయంతో అల్లాడి పోయారు. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెళ్లంపల్లి శ్రీనివాస్ అక్కడికి చేరుకొని పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెంటనే మహిళల కార్యకర్తలను తీసుకొని నున్న పోలీస్ స్టేషన్ లో బోండా ఉమ కొడుకు రవితేజ మీద ఫిర్యాదు చేశారు.
బోండా ఉమ కొడుకు రవితేజ వ్యవహారశైలి మొదటి నుండి వివాదాస్పదంగా వుంది. కారు రేసులతో యువతను చెడగొడుతూ ఇద్దరి చావుకు కారణం అయ్యాడు. అంతే కాకుండా కొంత మందిని మత్తుకు బానిసలుగా చేసి వారిని తన వెనుక తిప్పుకుంటూ తమకు అడ్డు చెప్పిన వారి మీద దాడులు చేపిస్తూ వస్తున్నారు. కనపడిన ప్రతి భూమిని కబ్జాలు చేశారు. వీరి కబ్జా ఫలితంగా ఒక చంటి పాప అనారోగ్యనికి గురై తమ భూమిని బోండా ఉమ అతని అనుచరులు కబ్జా చేశారు అని కంటతడి పెట్టిన వీడియో అందరికీ తెలిసిందే. మాజీ సైనికుల భూమిని బోండా ఉమ చేసిన కబ్జాల గురించి మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలను ప్రచురించారు. ఇలా బోండా ఉమ, ఆతని కొడుకు రవితేజ లు తమ అనుచరులతో భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు.
వీరి గురించి మీడియా ప్రతినిధులుతో వైసీపీ అభ్యర్థి వెళ్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బోండా ఉమ, ఆతని కొడుకు రవితేజ ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలి లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు అని మాట్లాడారు. అధికారం లేకుంటేనే ఇలా దాడులు చేసి ప్రజలను , మహిళను వేధిస్తున్నారు ఇక అధికారం ఇస్తే బతకనిస్తారా విజయవాడ సెంట్రల్ ప్రజలు ఆలోచన చెయ్యాలి అని తెలిపారు.