2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. తాడేపల్లి లో చంద్రబాబుఅధ్యక్షతన చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదలకి సంబంధించి మీడియా సమావేశం జరిగింది. మీడియా సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సిద్ధార్థ్ సింగ్ హాజరయ్యారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఒక ఆశ్చర్యకర సంఘటన కనిపించింది.
కూటమి మేనిఫెస్టోని కనీసం ముట్టుకోవడానికి కూడా నిరాకరించారు బిజెపి జాతీయ నాయకుడు సిద్ధార్థ్ సింగ్. కూటమి మేనిఫెస్టోను ఎట్టకేలకు విడుదల చేశారు.. పాత వాటినే మళ్ళీ వడ్డించినట్టు గతంలో ప్రకటించిన పథకాలనే మళ్లీ మేనిఫెస్టో పేరుతో ప్రకటించారు. మొదట మేనిఫెస్టో ప్రకటనలో బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొంటారు అనే సమాచారం అందినా ఆమె మేనిఫెస్టో విడుదలకి రాలేదు.
మేనిఫెస్టో పత్రంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ఫోటో మాత్రమే ఉంది. మేనిఫెస్టో పత్రంపైన బిజెపికి సంబంధించిన నాయకుల ఫోటోలు లేకపోవడం గమనర్హం. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టోకి బిజెపికి ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. దీనితో అమలు గాని మేనిఫెస్టోలో తమ పేరును ప్రకటించుకోవడంలో బిజెపి ఇష్ట పడటం లేదు ఏమో అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 2014 ఎన్నికల్లో కూటమి మేనిఫెస్టోలో మోడీ ఫోటో వేసి ప్రచారం చేసిన చంద్రబాబు నేడు ఆ సంప్రదాయం అమలు పరచకపోవడం పలు అనుమానాలకి తావు ఇస్తుంది. అమలు కాని ఉమ్మడి మేనిఫెస్టో పైన మాకు సంబంధించిన ఎవరి ఫోటోలు వేయద్దని బిజెపి నేతలు తెలిపినట్లు సమాచారం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి బిజెపి సపరేట్గా మేనిఫెస్టో విడుదల చేస్తుంది అని చంద్రబాబు నాయుడు తెలిపారు. కూటమిలో ఉండే ఇలా విడిగా మేనిఫెస్టో విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటో కానీ చూసే వారు మాత్రం బిజెపి కేంద్ర అధిష్టానానికి కూటమిలో ఉండడం ఇష్టం లేదు అనే సంకేతాలు బయటికి వెళ్తున్నాయి అని వ్యాఖ్యనిస్తున్నారు.