2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూటమి తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. తాడేపల్లి లో చంద్రబాబు అధ్యక్షతన చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదలకి సంబంధించి మీడియా సమావేశం జరిగింది. మీడియా సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సిద్ధార్థ్ సింగ్ హాజరయ్యారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఒక ఆశ్చర్యకర సంఘటన కనిపించింది. కూటమి మేనిఫెస్టోని కనీసం ముట్టుకోవడానికి కూడా నిరాకరించారు బిజెపి జాతీయ నాయకుడు […]
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మకి తన అనుచరుల నుండే చుక్కెదురైంది. ఇంతకాలం వర్మని కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీడలా నడిచిన కార్యకర్తల నుండే వ్యతిరేకత మొదలైంది. ఒక రకంగా పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనుచరులు టిడిపి కార్యకర్తలు ఎవ్వరు కూడా వర్మ నిర్ణయంతో సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. తమ అభిమాన నాయకుడికి టికెట్ వస్తుందని, మేమంతా ఆయన వెనుక ఉండి గెలిపించుకుంటామని కలలు కన్న కార్యకర్తల ఆశలు అడియాశలుగా మిగిలిపోయిన నేపథ్యంలో […]
కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న టీడీపీ, జనసేన, బిజెపి తమ అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్ కదన రంగంలోకి దిగాయి. ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా టీడీపీ జనసేన తమ అభ్యర్ధుల తరుపున ప్రచారం చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా రెండు రోజులపాటు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. అందులో ఈరోజు సాయంత్రం తణుకు నియోజవర్గంలో టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ తరుపున ప్రచారం చేయనున్నారు అటూ నుండి నిడుదవోలు లో […]
రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కుర్చున్నాడట. అలా ఉంది టీడీపీ-జనసేన పొత్తు పరిస్థితి. 118 స్థానాల్లో కూటమిగా పోటీ చేస్తామని చెబుతూనే తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులను చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించారు. పైగా పొత్తు సూపర్ హిట్ అని స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు. ఓ పక్క తమకు సీట్ దక్కలేదని ఆగ్రహావేశాలతో ఇరు పార్టీల నాయకులు ఊగిపోతుంటే మా పొత్తు సూపర్ హిట్టు, మా బొమ్మ బ్లాక్ బస్టర్ […]