జగన్ దావోస్ కి డుమ్మా అంటూ విషం చిమ్మిన ఈనాడు ఇప్పుడు ఈ వార్త చూస్తే ఏమి అవుతారో, నార్వే దేశానికి చెందిన క్రోన్ ఎల్ఎన్జి (Crown LNG) సంస్థ ఏపీలో బిలియన్ డాలర్లు ను పెట్టుబడిగా పెట్టనుంది.మన ఇండియన్ గ్యాస్ కి భవిష్యత్తులో ఎక్కువ గా డిమాండ్ ఉండే అవకాశం ఉంది . ఈ ఎల్ఎన్జి టెర్మినల్ పూర్తి అయితే భారతదేశం లో రెండో అతిపెద్దది టెర్మినల్ గా నిల్వనుంది. 2028 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి కార్యకలపాలు నిర్వహిస్తాం అని సంస్థ సీఈఓ ఒక ప్రకటన లో తెలిపారు.
కాకినాడలో నిర్మించబోయే ఈ టెర్మినల్ కెపాసిటీ 7.2 మిలియన్ టన్నులు . గతంలో టీడీపీ ప్రభుత్వం దావోస్ కి వెళ్ళినప్పుడు భారత దేశపు సన్ రైజింగ్ రాష్ట్రం అని పెట్టుబడులు తీసుకొని వస్తాం అని వెళ్ళి అక్కడ ఫుడ్ స్టాల్ లో పాలకూర పప్పు, బెండకాయ వేపుడు, పులుసు అని తింటూ కాలక్షేపం చేసుకుంటూ బిజీగా ఉన్నట్లు హడావిడి అయితే చేశారు కానీ పెట్టుబడులు సాధించింది ఏమీ లేదు.
అలాగే వైజాక్ లో బిజినెస్ సమ్మిట్ ల పేరిట నకిలీ వ్యాపార వేత్తలతో నేల పై కూర్చొని MOU లు చేసిన ప్రహాసనాలను అచ్చోసిన ఎల్లో మీడియా మర్చిపోయిందేమో కానీ ప్రజలు మర్చిపోలేదు.
అలా బాబు గారు చేసిన ఈవెంట్లే తప్ప నిజమైన పెట్టుబడులు, నిజమైన అభివృద్ధి ఈ ఎల్లో మీడియా కంటికి కనపడదనుకొంటా .