ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్, నిజాం ఇలా కొన్ని శతబ్దాలపాటు మచిలీపట్నం పోర్ట్ ని ఉపయోగించుకొని తమ ఎగుమతులు దిగుమతులు నిర్వహించుకున్నారు.
అలాంటి మహా ప్రతిష్ట కలిగిన మచిలీపట్నం ఓడరేవు 1960 నుంచి ఉపయోగం లేకుండా, ఇక్కడ ఒక పోర్ట్ ఉంది అనే దాఖలాలు లేకుండా పోయింది.అలాంటి మహోత్తర పోర్ట్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే జీవం పోసుకుంది. జగన్ సంకల్పం ముందు పోర్ట్ కు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయి అనుమతలు అన్ని త్వరతగతిన పూర్తి చేసుకొని మే 22 2023 లో శంకుస్థాపనకు నోచుకోని పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
24 నెలలు లో పూర్తి చేయాలి అని దృడ సంకల్పంతో ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టారు. రివర్స్ టెండరింగ్ ద్వారా మెగా ఇంజనీరింగ్ సంస్థ మచిలీపట్నం పోర్ట్ పనులు దక్కించుకుంది. 5153 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో ప్రాజెక్ట్ పనులు మొదలై ఇప్పటి నార్త్ బేక్ వాటర్ పనులు పూర్తి చేసుకుని సౌత్ బేక్ వాటర్ పనులు 2.1 కిలోమీటర్లు దూరంతో పనులు మొదలు అవగా ఇప్పటికే 1.5 కిలోమీటర్లు పనులు పూర్తి చేసుకొని మిగిలిన పనులు ఫిబ్రవరి మధ్యకి పూర్తి చేయాలని డెడ్లైన్ విధించుకొని పనులు చేస్తున్నారు.
16 బెర్త్ లు 115.97 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో బందర్ పోర్ట్ పనులు జరుగుతున్నాయి. తొలిదశలో 4 బెర్త్ లు లలో 2 సాధారణ బెర్త్ లు , ఒకటి మల్టీ పర్పస్ బెర్త్, ఒకటి బొగ్గు రవాణా లకు సంబంధించిన బెర్త్ లు 2024 జూన్ లో కార్యకలాపాలు నిర్వహించుకోవడం కోసం తయారు చేస్తున్నారు.
ఈ పోర్ట్ నిర్మాణ పనులు పూర్తి అయితే ప్రత్యేక్షంగా పరోక్షంగా 35000 వేల మందికి ఉపాధి అవకాశం దొరుకుతుంది.
చంద్రబాబు పాలనలో మచిలీపట్నం పోర్ట్ పనులుకు పర్యావరణ అనుమతులు ఉండవ్, ఒక భూసేకరణ ఉండదు, శిలాఫలకాల శంకుస్థాపనలు మాత్రం భలే కనిపిస్తాయి. అభివృద్ది చేయాలి అని చిత్తశుద్ధి ఉంటే జగన్ మోహన్ రెడ్డి లాగా అన్ని అనుమతులు తీసుకొని అనుకున్న టైమ్ ప్రకారం పనులు పూర్తి చేసి ఉపయోగం లోకి తీసుకొని రావాలి కానీ బాబుకి లేనిది ఆ చిత్తశుద్ధి ఒక్కటే.