గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పలు పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరగా వందల కోట్ల విలువైన దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. కొందరు నేతలు దేవాలయ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా వాటిని విక్రయించి వందల కోట్లను కొల్లగొట్టారు. ఈ వాస్తవాలను ఎన్నడూ రాయని ఈనాడు తాజాగా దేవాలయాల విషయంలో జగన్ ప్రభుత్వంపై బురద జల్లడం హాస్యాస్పదం. ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక దేవాలయ భూముల రక్షణకు నడుం బిగించారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన దురాగతాలను అరికట్టే విధంగా పలు సంస్కరణలు తీసుకొచ్చారు. చంద్రబాబు హయాంలో దేవాలయ భూములను తన అనుచరులకు అన్యాక్రాంతం చేయడానికి బాబు చేయని ప్రయత్నం లేదు. ఓసారి బాబు హయాంలో దేవాలయాల పరిస్థితి ఎలా ఉందో పరిశీలిస్తే కింది విషయాలు బోధపడతాయి.
ఆలయ భూములను దోచుకున్న చంద్రబాబు
చంద్రబాబుముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడలో రోడ్లకు అడ్డుగా ఉన్నాయనే నెపంతో ఒకే రాత్రి 40 గుళ్లను పగలగొట్టి మున్సిపాలిటీ వ్యాన్ లలో తరలించాడు. ఈ విషయాన్ని ఈనాడు ఏనాటికి ప్రస్తావించదు. ప్రజలు ఆరాధించే దేవతామూర్తుల విగ్రహాలను మునిసిపాలిటీ వాహనాల్లో తరలిస్తున్నా రామోజీ నోరుమెదపలేదు. పైగా ఆలయ భూములను ఆలయాల భుములను టీడీపీ నేతలు ఇష్టానుసారం వాడుకునేందుకు వీలుగా కేవలం ఐదారుగురు అధికారులతో తాత్కాలిక పరిషత్ ఏర్పాటుచేశారు. దీనివల్ల టీడీపీ నేతలు ఆలయ భూములను దోచుకునేందుకు మార్గం సుగమమైంది.
అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ఉన్న ఆలయ భూములను, ట్రస్ట్ భూములను అమ్మి వందల కోట్ల దోపిడీకి చంద్రబాబు తెరతీశాడు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పేరుతో విశాఖ పరిసరాల్లో దేవదాయ శాఖకు చెందిన 400 ఎకరాలకుపైగా మాన్సాస్ ట్రస్టు భూములను అమ్మకానికి పెట్టారు. కానీ, కాలేజీపై నిర్మాణాన్ని గాలికొదిలేసి ఆ ఐదేళ్లలో 70ఎకరాల వరకు విక్రయించి రూ.వందల కోట్లను పోగేసుకున్నారు. బెంజ్‌సర్కిల్ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను అధికారులు వ్యతి రేకించినప్పటికీ తక్కువ లీజుకే బాబుకు అత్యంత సన్నిహితుడి విద్యాసంస్థకు టీడీపీ సర్కార్ కట్ట బెట్టింది. ఇలా దేవదాయ శాఖకు చెందిన అనేక భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నంలేదు. అంతేకాకుండా లోకేష్ కోసం విజయవాడ దుర్గ గుడిలో క్షుద్రపూజలు చేసిన ఘనత చంద్రబాబు సొంతం.
జగన్ పాలనలో దేవాలయాల అభివృద్ధి
చంద్రబాబు నిర్లక్ష్యానికి చరమగీతం పాడుతూ సీఎం జగన్ పలు సంస్కరణాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా దేవదాయ శాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాల పునరుద్ధరణను చేపట్టింది. నూతన ఆలయాల నిర్మా ణంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలలా 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. విజయవాడ దుర్గగుడి ఆలయ అభివృద్ధికి ఎప్పుడు లేనంతగా ప్రభుత్వ ఖజానా నుంచి రూ.70 కోట్లను మంజూరు చేసింది. అంతేకాకుండా ఆలయాల భూములను ఎవరూ ఆక్ర మించుకునేందుకు వీల్లేకుండా సీఎం జగన్ ఆర్డినెన్స్ తీసు కొచ్చారు. చంద్రబాబు నిర్లక్ష్యం చేసిన ధార్మిక పరిషత్ ను సీఎం జగన్ ప్రభుత్వం 2022లో పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసింది. తద్వారా ఆలయ భూముల ఆక్రమణకు అడ్డుకట్ట పడింది.
దేవదాయ శాఖ పరిధిలోని చిన్నా, పెద్ద ఆలయాలు అన్నింటికీ టీడీపీ నేతలే ట్రస్టు బాధ్యతల్లో ఉండేవారు. కానీ సీఎం జగన్ ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ ఆయా ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తోంది. దేవదాయ శాఖ పరిధిలో 25 వేలకు పైగా ఆలయాలు, సత్రాలు ఉండగా రూ.5 లక్షలు పైబడి ఆదాయమున్న 1,400 ఆలయాలకే ప్రభుత్వం ట్రస్టు బోర్డులు నియమిస్తోంది. దీంతో ఆలయ వ్యవహారాల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం తగ్గింది.
ఈ విధంగా దేవాలయాల అభివృద్ధికి పలు సంస్కరణాత్మక నిర్ణయాలు తీసుకుని వాటి అభివృద్ధికి పాటుపడుతున్న జగన్ ప్రభుత్వంపై రామోజీ అసత్య ప్రేలాపనలు చేయడం సమంజసం కాదు. తన అభిమాన నాయకుడు చంద్రబాబు చేసిన తప్పులను దేవాలయాల విషయంలో చేసిన అన్యాయాలను దోపిడీలను కప్పిపెట్టి దేవాలయాలకు తిరిగి ఊపిరిపోస్తున్న జగన్ ప్రభుత్వంపై ఈనాడు బురదజల్లడాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించాలి.