నాడు చంద్రబాబు హయాంలో.. ఆర్థిక పరిస్థితి ఎంత అతలాకుతలంలో ఉండే దోపిడీ ఏ స్థాయిలో ఉండేదో ఉదాహరణలు కోకొల్లలు. సంక్షోభంలో సంపద సృష్టిస్తానంటాడు. తీరా చేసి సామాన్యులపై పన్నుల మోపుతాడు. ఎప్పుడు చూసినా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెస్తాడు. మళ్ళీ ఆ డబ్బునే కావలసిన వాళ్ళకి కట్టబెట్టి అధికారుల నిర్లక్ష్యం వల్ల దుర్వినియోగం అయ్యాయి అంటాడు.
చంద్రబాబు హయాంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పలు సబ్సిడీలను తగ్గిస్తూ, భారీగా పన్నులను వడ్డించారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు. ఆపై తన దృష్టిని ప్రభుత్వరంగ సంస్థలపై కేంద్రీకరించారు. ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి అనేక కారణాలున్నా,వాటన్నింటినీ క్షమించగలిగినా… ప్రభుత్వ రంగ సంస్థలను ఆయన భ్రష్టు పట్టించిన విధానం మాత్రం క్షమించరానిది. ఒకానొక సమయంలో స్వయంగా ఆయనే… కొన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగులను వారి ఇంటిలో కూర్చోబెట్టి జీతాలిస్తే సంస్థ ఖర్చులు తగ్గి డబ్బులు మిగులుతాయని, వారిచేత పనిచేయిస్తే నష్టాలొస్తాయని అన్నారంటే ఆ సంస్థల దుస్థితి ఎలా ఉందో మనకి విశదమవుతోంది.
1996-96 లో పోలీసు గృహ నిర్మాణం, హెచ్ అండ్ ఎం గృహ నిర్మాణ సంస్థలు లాభనష్టాల్లేకుండా బ్రతుకు వెళ్లదీసాయి. మరో నాలుగు సంస్థలు స్వల్ప లాభాల్లో ఉండేవి. ఎపిటిఎస్కు కేవలం రూ. 58 వేలు మాత్రమే లాభం వచ్చింది. ఎపిఇడిసికి రూ. 9.35 లక్షలు, విత్తనాభివృద్ధి సంస్థకు రూ.13.06 లక్షలు, టూరిజంకు రూ. 28.58 లక్షలు మాత్రమే లాభాల వచ్చాయి. మరో మూడు సంస్థలు కోటి రూపాయలకు లోపే లాభాలున్నాయి. చాలా సంస్థలు ఏళ్లతరబడి వసూలుకాని మొండిబాకీలను కూడా రాబడిగా దొంగ లెక్కలు చూపించి లాభాలున్నట్లు చెప్పించారు చంద్రబాబు. తానే స్వయంగా తీసుకున్న నిర్ణయాలతో వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ఆపై ఆయా రంగ సంస్థలపై నిందలు వేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు చంద్రబాబు.
ఇక ప్రపంచ బ్యాంకు నుంచి బోలెడు రుణాలు రప్పించేసానూ, పధకాలు తెచ్చేసానూ అని డబ్బా కొట్టిన పర్యావరణ అభివృద్ధి పధకాలపుడు కూడా, కోట్ల రూపాయల ఆదాయాన్ని కొల్పోవడమే కాకుండా విదేశీ అప్పులు కూడా పెరిగే అవకాశముందని పర్యావరణ శాస్త్రజ్ఞులు భావించారు. సుమారు 70 మిలియన్ డాలర్ల(245 కోట్ల రూపాయలు) ఈ ప్రాజెక్టు విషయమై ఒకవైపు విమర్శలు వస్తుండగానే మరోవైపు ప్రపంచ బ్యాంకుకు పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖకు మద్య చర్చలు సాగాయి. ఈ ప్రాజెక్టును ఇండియన్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రూపొందించింది. పర్యావరణ పరంగా రక్షించ దగ్గ ప్రాంతాలను తమ అవసరాల కోసం వాడుకుంటున్న ప్రజల నుండి రక్షించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. రాంతంబొర్ (రాజస్థాన్), గిర్(గుజరాత్), నాగర్ హోల్ (కర్నాటక), పెంచ్ (మధ్యప్రదేశ్), బుక్సా(పశ్చిమబెంగాల్), పెరియార్(కేరళ), మావ్(బీహార్)లను ఈ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చారు.
ఈ ప్రాజెక్టుల వల్ల లాభాలకన్నా నష్టాలే ఎక్కువున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారతదేశపు వన్యప్రాణుల సంరక్షణ, అడవుల ప్రాంతాలలో జీవించే వారి జీవనాధారా న్ని ఈ ప్రాజెక్టు దెబ్బతీస్తుందని వారు అన్నారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్కు చెందిన అనిల్ అగర్వాల్, సునితా నారాయణ్, సమతా పార్టీ నాయకుడు జార్జి ఫెర్నాండెజ్, రజనీ కొఠారీ, సొలి సోరాబీ మొదలగు మేధావులు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఈ ప్రోజెక్టును మన రాష్ట్రంలో రూపొందించడానికి చంద్రబాబు విపరీతమైన ఆసక్తి కనబరిచారు. పేదలు నిర్వాసితులు అవుతారు అని అప్రమత్తం చేసినా… కేవలం ప్రపంచ బ్యాంకు ప్రాపకం కోసం ఆయన ఈ ప్రోజెక్ట్‌కు విపరీతమైన ప్రచారం కలిపించారు. మరి ఇది ఏరకంగా సంక్షోభం లో సంపదో ఆయనకే తెలియాలి. సుసంపన్నంగా ఉన్న అడవుల్ని ప్రపంచ బ్యాంకుకి కట్టబెట్టి సంక్షోభం సృష్టించాలని చూసారు చంద్రబాబు.
మిగతా రాష్ట్రాలకన్నా మనరాష్ట్రం పన్నుల వసూలలో ఎంతో వెనకబడి పోయిందనీ, పన్నులు ఏ ఒక్కటి పెంచినా దాని ప్రభావం రాష్ట్ర జనజీవనంపై ముసురుకుంటుందని తెలిసినా టర్నోవరు టాక్స్ మరోమారు పెంచి, ఆటు వ్యాపారులను పీడించడానికి ఇటు ప్రజలను అధిక ధరలతో ఏడిపించడానికి బాబు కంకణం కట్టుకున్నారు. 1993లో అప్పటి ప్రభుత్వం 200 కోట్ల అదనపు ఆదాయంకోసం టర్నోవరు పన్నును పెంచి చేతులు కాల్బుకున్న విషయం తెలిసినా, రాష్ట్ర ప్రజలపై పన్ను వల్ల పెరిగిపోయిన ధర రెండు వేల కోట్ల రూపాయల మేర అదనపు భారాన్ని మోయాల్సి పడింది. సంబంధం ఉన్నా లేకపోయినా అన్ని వస్తువుల ధరలు టర్నోవరు పన్ను పేరుతో 20 నుంచి 30 శాతం వరకూ పెంచి వేడుక చూసి, ప్రజల జీవితంతో ఆడుకుని రాక్షసానందం పొందారు బాబు.
ఇలా ఏం అంశం చూసినా… బాబు వల్ల ప్రజలకు నష్టం, కావలసిన వాళ్ళకు లాభం కలిగింది తప్ప… ఏనాడు బాబు తాను చెప్పినట్టు సంక్షోభం నుంచి రాష్ట్రం కోసం సంపద సృష్టించలేదు. తన కోసం తన వాళ్ళ కోసం మాత్రం విపరీతంగా సంపద సృష్టించుకున్నారు.