అవ్వ తాతల పింఛన్ల పంపిణీ పైన చంద్రబాబు రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తూనే ఉన్నాడు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామ/ వార్డ్ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చాడు. ఆ వ్యవస్థలు తీసుకొని వచ్చిన తర్వాత రాష్ట్రంలో పింఛన్లు పొందే వారికి నెల నెల ఒకటో తారీఖున వారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ ఇచ్చే వ్యవస్థను నెలకొల్పాడు. నాలుగు సంవత్సరాల పది నెలలు పాటు సాఫీగా సాగిన ఈ ప్రక్రియ ఎన్నికల ముందు చంద్రబాబు తన అనుచరులు ద్వారా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వడం ఆపించండి అంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేయించాడు. హైకోర్టు నుంచి తీర్పులు తమకి అనుకూలంగానే వచ్చిన మీడియా ముందు మాత్రం పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించారు.
ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు మే నెలలో పెన్షన్ల పంపిణీ డిబిటి విధానంలో అమలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పెన్షన్ పొందుతున్న వారిలో 75% మందికి బ్యాంక్ ఖాతాలు ఉండటంతో వారికి బ్యాంక్ ఖాతాలోని పెన్షన్ల జమకు అధికారులు నిర్ణయించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చంద్రబాబు మీడియా ముందు మాట్లాడాడు. దీంతో చంద్రబాబు తన ద్వంద వైఖరిని మానుకోవాలని.. అవ్వ తాతలకు ఏ కష్టం లేకుండా అందుతున్న పెన్షన్ కార్యక్రమాన్ని అడ్డుకొని ఇప్పుడు తిరిగి అది కొనసాగించాలి అనడం కడు విడ్డూరం అని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.