ఎన్నికల ప్రచారాం లో మైక్ దొరికితే చాలు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ లు ఇచ్చే చంద్రబాబు, ఈసారి ఎన్నికల ప్రచారం లో తన పిచ్చి స్టేట్మెంట్ ల డోస్ మరింత పెంచాడు.. 2014 ఎన్నికల్లో జిల్లాకో బుల్లెట్ ట్రైన్, జిల్లాకో ఎయిర్పోర్ట్ ఎక్కడికెళ్లాలి అన్నా గంటలో వెళ్లిపోవచ్చు తమ్ముళ్లు, అమరావతి టు విజయవాడ హైపర్‌లూప్ ఐదునిముషాల్లో ప్రయాణం అని వింత వింత స్టేట్మెంట్ లు ఇచ్చిన బాబు ఈసారి మరో అడుగు ముందుకేశాడు….
ఉదయం: మీ ఆదాయాన్ని డబల్, ట్రిబుల్ చేయడానికి నా బ్రెయిన్ పెంచుకుంటా, అవసరం అయితే ఏఐ సాయం తీసుకుంటా…..
మధ్యాహ్నం: రేపటి నుండి టీడీపీ గ్రాఫ్ పెరగాలి, అలా పెరుగుతుందా లేదా అని మీ ఇళ్లలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసా…
మధ్యాహ్న భోజన అనంతరం మహిళలతో : మీ మొగుళ్లు టీడీపీ కి ఓటెయ్యకుంటే ఇంటికొచ్చాకా అన్నం పెట్టొద్దు…
సాయంత్రం: కుప్పాన్ని బెంగుళూరు తో అనుసంధానం చేస్తా…
రాత్రి: నేను రాకముందు హైదరాబాద్ కి దిక్కే లేదు.. హైదరాబాద్ కి పేరు పెట్టింది నేనే, అమరావతికి పేరు పెట్టింది నేనే…
ఇలాంటివి అన్నీ చూడటానికి సాధారణం గా కనిపించవచ్చు గానీ, ఇవి మేగలోమానియా లక్షణాలు అని, బాబుకు మేగలోమానియా విపరీత స్థాయిలో పెరిగింది అని మానసిక వైద్యులు చెబుతున్నారు.. ఈ వ్యాధి లక్షణాలు:
1.తనని తాను ఎక్కువగా ఊహించుకోవడం, తను లేకపోతే ఈ సమాజం ఏమైపోతుందో అనే భావన కలగడం.
2.ఎదుటివారు ఏమనుకుంటారో పట్టించుకోకపోవడం, కేవలం తన గురించే ఆలోచించడం.
3.అధికారం పై వ్యామోహం, ఇతరులపై నియంత్రణ కలిగి ఉండాలి అనే ధోరణి..
4.తానే అందరికన్నా ఉన్నతుడని భావించడం, తాను దైవాంశసభూతుడిని భావించడం. తను తలచుకుంటే ఏదైనా చేయగలను, ఇప్పటి వరకు జరిగిన గొప్ప కార్యాలన్నిటికీ తానే కారణం అనుకోవడం.
5.అసందర్భంగా కోపోద్రిక్తుడు అవ్వడం..
ఇవన్నీ మెగాలోమేనియా లక్షణాలు అని అవన్నీ పుష్కలంగా బాబు లో కనిపిస్తున్నాయని ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ విశేష్ అభిప్రాయపడుతున్నారు..